Bidens Son – Alka Sagar : పన్ను ఎగవేత ఆరోపణల కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కాసేపట్లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో ఆయన కోర్టుకు హాజరుకానుండటం ఇదే తొలిసారి. హంటర్ బైడెన్ 2016 నుంచి 2020 సంవత్సరాల మధ్య రూ.11 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. తన విలాసవంతమైన జీవనశైలి కోసం ఆయన వందల కోట్లు ఖర్చు చేశాడని, అయితే ఆ ఖర్చులకు సంబంధించిన లావాదేవీలపై పన్నులను చెల్లించలేదని అంటున్నారు. 2016 నుంచి 2020 మధ్యకాలంలో హంటర్ బైడెన్ రూ.58 కోట్లు సంపాదించాడని.. అయితే ఆ సంపాదనపై పన్నులు కట్టకుండా తన స్నేహితురాళ్లు, డ్రగ్స్, ఖరీదైన కార్లు, లగ్జరీ హోటళ్లు, విలాసవంతమైన జీవనశైలి కోసం ఖర్చు చేశాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- విశేషమేమిటంటే.. హంటర్ బైడెన్ కేసును లాస్ ఏంజిల్స్ మేజిస్ట్రేట్ కోర్టుకు చెందిన భారత సంతతి న్యాయమూర్తి అల్కా సాగర్ విచారిస్తున్నారు.
- అల్కాసాగర్ కుటుంబం 20వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర భారతదేశం నుంచి తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లింది.
- ఉగాండా దేశంలో ఆమె జన్మించారు.
- జడ్జి అల్కా సాగర్‌కు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆఫ్రికా నుంచి అమెరికాకు వలస వచ్చారు.
- మేజిస్ట్రేట్ అయిన మొదటి భారత సంతతి మహిళగా అల్కా సాగర్ గుర్తింపు పొందారు.
- ఆమె 2013 నుంచి మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
- అల్కా సాగర్.. 1981లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఆంత్రోపాలజీలో బీఏ పట్టా పొందారు.
- 1984లో లాస్ ఏంజిల్స్ స్కూల్ ఆఫ్ లా నుంచి అల్కా సాగర్ న్యాయవాద పట్టా పొందారు.
- 1987లో ఆమె కాలిఫోర్నియాలోని అమెరికా అటార్నీ కార్యాలయం నుంచి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
- 1991లో అల్కా సాగర్ అమెరికా అటార్నీ కార్యాలయం అసిస్టెంట్ నుంచి డిప్యూటీ చీఫ్‌గా పదోన్నతి పొందారు.
- 2001లో ఆమె అమెరికా అటార్నీ కార్యాలయం మేజర్ ఫ్రాడ్ విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా నియమితులయ్యారు.
- అమెరికా అటార్నీ కార్యాలయంలో చేరడానికి ముందు అల్కా సాగర్ లాస్ ఏంజిల్స్‌లోని రెండు న్యాయ సంస్థలలో అటార్నీగా పనిచేశారు.
- అమెరికా అటార్నీ కార్యాలయంలో ఉన్నప్పుడు ఆమె మనీలాండరింగ్, పన్ను ఎగవేత, పన్ను మోసం వంటి కేసులను(Bidens Son – Alka Sagar) నిర్వహించేవారు.