Site icon HashtagU Telugu

Israel-Hamas War: రేపు ఇజ్రాయెల్ కు జో-బైడెన్

Israel Hamas War (2)

Israel Hamas War (2)

Israel-Hamas War: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేప్ బుదవారం ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. హమాస్ దాడి తర్వాత దెబ్బతిన్న ఇజ్రాయెల్ దేశాన్ని జో బైడెన్ సందర్శించనున్నట్టు, ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరుపనున్నట్టు పేర్కొన్నారు. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ కు మద్దతు ప్రకటించారు జో బైడెన్. హమాస్ పై దాడులకు కావాల్సిన సాయం చేస్తున్నారు. అంతకుముందు జో బిడెన్ ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాధినేతలతో చర్చలు జరిపారు. ఇజ్రాయెల్, పాలస్తీనా నాయకులతో వేర్వేరు ఫోన్ లో మాట్లాడారు.

హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకరంగా వైమానిక దాడులు చేస్తుంది. ఆహారం, నీళ్లు లేక గాజా వాసులు అలమటిస్తున్నారు. నీరు, విద్యుత్తు, నిత్యవసరాలు, ఆసుపత్రుల్లో మందులు, వైద్య సామగ్రి నిల్వలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గడిచిన 11 రోజులుగా హద్దూ అదుపూ లేకుండా ఒకరిపై ఒకరు మిలిటెంట్లతో దాడులు చేసుకుంటున్నారు. ఈ మారణహోమంలో లక్షలాది ఇళ్లు నేలకూలాయి. తిండి లేక ప్రజలు బిక్కు బిక్కుమని బ్రతుకుతున్నారు. ముఖ్యంగా గాజాలో మహిళలు, చిన్నారులుపెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణిస్తున్నారు.

Also Read: Litton Das: జర్నలిస్టులపై లిటన్ దాస్ దురుసు ప్రవర్తన