US Vs Israel : ఇజ్రాయెల్‌కు అమెరికా షాక్.. ఏం చేసిందంటే.. !!

US Vs Israel : గతేడాది అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా భారీగా ఆయుధాలను సప్లై చేసింది. 

  • Written By:
  • Updated On - May 8, 2024 / 01:06 PM IST

US Vs Israel : గతేడాది అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా భారీగా ఆయుధాలను సప్లై చేసింది.  తాజాగా మారిన పరిణామాలతో తన పెద్దన్న అమెరికా మాటలను కూడా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతోంది. దీంతో ఇజ్రాయెల్‌కు షాక్ ఇచ్చే కీలక నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఇజ్రాయెల్‌కు ఆయుధాల రవాణాను తాత్కాలికంగా అమెరికా నిలిపివేసినట్లు సమాచారం. గాజాలోని రఫా ప్రాంతంపై భారీ దాడికి రెడీ అవుతున్న ఇజ్రాయెల్‌కు(US Vs Israel) ఈ పరిణామం షాక్ లాంటిదే.

We’re now on WhatsApp. Click to Join

గాజాలోని రఫా ప్రాంతం విస్తీర్ణంలో చాలా చిన్నది. గాజాలోని అన్ని ప్రాంతాలను ఇజ్రాయెల్ విధ్వంసం చేసింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం రఫాలోనే తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం రఫాలో దాదాపు 15 లక్షల మందికిపైగా పాలస్తీనియులు తలదాచుకుంటున్నారు. ఇప్పటికే రఫాపై ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు మొదలుపెట్టింది. ప్రతిరోజూ కనీసం రెండు డజన్ల మంది పాలస్తీనా ప్రజలు రఫాలో చనిపోతున్నారు. ఒకవేళ దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తే.. రఫాలో పాలస్తీనియుల మరణాలు మరింత పెరిగే ముప్పు ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు గుడ్డిగా మద్దతు ఇస్తున్న అపవాదు అమెరికాపై ఉంది. రఫాపై దాడికి కూడా ఆయుధాలను సప్లై చేస్తే తమ దేశం ఇమేజ్ ఇంకా దెబ్బతింటుందనే భావనకు అమెరికా వచ్చింది. అందుకే తాత్కాలికంగా ఇజ్రాయెల్‌కు ఆయుధాల సప్లైను ఆపేసింది. కనీసం ఈ నిర్ణయంతోనైనా ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగుతుందని అమెరికా భావిస్తోంది.

Also Read : Kim Jong Un : ప్యాలెస్‌ను కూల్చేసిన కిమ్ జోంగ్ ఉన్.. ఎందుకో తెలుసా ?

ఇప్పటికే దాదాపు 40 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి గాజా మిలిటెంట్ సంస్థ హమాస్ అంగీకరించింది. తాము ఇజ్రాయెలీ బందీలను విడుదల చేస్తామని.. దానికి ప్రతిగా పెద్దసంఖ్యలో పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేసింది. అయితే ఇందుకు ఇజ్రాయెల్ నో చెప్పింది. హమాస్ ‌తో సంధి కుదుర్చుకోవడం కంటే రఫాపై దాడి చేస్తేనే మంచిదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. హమాస్ మూలాలను రఫా నుంచి కూడా ఏరిపారేస్తామని వెల్లడించింది. యుద్ధానికి మొగ్గుచూపుతున్న ఇజ్రాయెల్‌ను ఎలా కంట్రోల్ చేయాలో అమెరికాకు తోచడం లేదు.

Also Read : Gujjula Premendar Reddy : ఎమ్మెల్సీ బైపోల్.. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి