Site icon HashtagU Telugu

Vivek Ramaswamy : వివేక్ రామస్వామికి డెత్ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తికి ఏమైందంటే ?

Vivek 1 Hour 4 Crores

Vivek 1 Hour 4 Crores

Vivek Ramaswamy : వివేక్‌ రామస్వామి.. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతి వ్యాపారవేత్త. ఇటీవల ప్రచార కార్యక్రమం వివరాలను వివేక్‌ రామస్వామి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వాటికి రిప్లై ఇచ్చిన ఓ వ్యక్తి డెత్ వార్నింగ్ ఇచ్చాడు. ‘‘వివేక్ రామస్వామిని చంపేందుకు మరో ఛాన్స్ లభించింది. ఈసారి ఎలాగైనా చంపేస్తాను. అతడి ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరినీ చంపేస్తాను’’ అని బెదిరించాడు. దీనిపై వివేక్‌ రామస్వామి ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

న్యూహాంప్‌షైర్‌లోని డోవర్‌కు చెందిన 30 ఏళ్ల టైలర్ ఆండర్సన్ ఈ హెచ్చరికలు చేశాడని పోలీసులు గుర్తించారు. ఆండర్సన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో దోషిగా తేలితే ఆండర్సన్‌‌‌కు  ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా పడతాయి. ఆండర్సన్‌ను వేగవంతంగా అరెస్టు చేసినందుకు పోలీసులకు వివేక్ రామస్వామి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మా చుట్టూ ఉన్న టీమ్‌కు నేను కృతజ్ఞుడిని. నేను సురక్షితంగా ఉండేలా చూసుకోవడంలో వారు గొప్ప పని చేస్తున్నారు’’ అని రామస్వామి(Vivek Ramaswamy) చెప్పారు.

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వివేక్ ఇటీవల ట్విట్టర్ వేదికగా జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. మైక్ ఆన్‌లో ఉన్న విషయం మర్చిపోయి ఆయన బాత్రూమ్‌కు వెళ్లారు. దీంతో నీటి చప్పుడు లైవ్‌లో ఉన్న వారందరికీ వినిపించింది. ఈ విషయాన్ని షో వ్యాఖ్యాత మారియో నాఫుల్ గుర్తుపట్టి వివేక్‌ను హెచ్చరించారు. ‘‘వివేక్, మీ మైక్ ఆన్‌లో ఉన్నట్టు ఉంది. నేను దాన్ని మ్యూట్‌ చేయలేకపోతున్నాను’’ అని పేర్కొన్నారు. కాసేపటికి తిరిగొచ్చిన వివేక్ పొరపాటు జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ కల్పించుకుని..‘‘మీకు ఇప్పుడు హ్యాపీగానే ఉందనుకుంట’’ అంటూ సరదా కామెంట్ చేశారు. రామస్వామి కూడా అంతే సరదాగా స్పందిస్తూ.. ‘అద్భుతంగా ఉంది’ అని రిప్లై ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివేక్‌తో పాటూ ప్రముఖ టెక్ ఎంట్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్, ఇన్ఫోవార్స్ అధినేత అలెక్స్ జోన్స్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.