Trump Currency: డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు. అమెరికా అంటేనే సూపర్ పవర్. ఆర్థికంగా, సైనికంగా అగ్రరాజ్యానికి ప్రపంచంలో తిరుగులేదు. అలాంటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫొటోతో కరెన్సీ నోట్లు రాబోతున్నాయా ? ఎంత వ్యాల్యూతో ఆ నోట్లను విడుదల చేయబోతున్నారు ?
Also Read :Sukesh Offer : ఎలాన్ మస్క్‌కు ఆర్థిక నేరగాడు సుఖేశ్ బంపర్ ఆఫర్
‘250 డాలర్ల బిల్లు’లో..
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సాగించిన పాలనా కాలం గుర్తుండిపోయేలా, 250 డాలర్ల (రూ.21వేల) కరెన్సీ నోటును తీసుకురావాలనేది ప్రతిపాదన. దానిపై ట్రంప్ ఫొటోను ముద్రించాలనేది ప్రపోజల్. ఈమేరకు సమాచారంతో అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు జోవిల్సన్ ఒక సంచలన బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లు ముసాయిదాకు ‘250 డాలర్ల బిల్లు’ అని పేరు పెట్టారు. ‘‘అమెరికాలో అత్యంత విలువైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఫొటోను కరెన్సీ నోటుపై ముద్రించాల్సిందే’’ అని సదరు బిల్లులో ప్రస్తావించారు. అందుకే ట్రంప్ ఫొటోతో 250 డాలర్ల నోటును ప్రింట్ చేయాలంటూ ‘బ్యూరో ఆఫ్ ఎన్‌గ్రేవింగ్ అండ్ ప్రింటింగ్’ను ఈ బిల్లులో కోరారు.
Also Read :AP MLC Polls: ఏపీ ఎమ్మెల్సీ పోల్స్.. ప్రధాన పోటీ ఈ అభ్యర్థుల మధ్యే
ఆర్థిక సంక్షోభానికి ట్రంప్ చెక్
గత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనా కాలంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి ట్రంప్(Trump Currency) చెక్ పెడుతున్నారని జోవిల్సన్ కొనియాడారు. దేశ అధ్యక్షుడిగా ట్రంప్‌ను గౌరవించేందు కోసమైనా 250 డాలర్ల నోట్‌ను ప్రింట్ చేయాలన్నారు. దీనిపై అమెరికా సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు తీరొక్క రకంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ట్రంప్ ఫొటోతో కరెన్సీ నోటు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read : Maha Shivratri : శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అనం
మల్టీ నేషనల్ కంపెనీలపై కీలక వ్యాఖ్యలు
అమెరికాలోని మల్టీ నేషనల్ కంపెనీలపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కంపెనీలు చాలా డబ్బును ఖర్చు చేస్తుంటాయని, భారీగా పన్నులను కడుతుంటాయని తెలిపారు. ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని కంపెనీలకు తన మద్దతు తప్పకుండా ఉంటుందని వెల్లడించారు.