అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నోరు మూసుకుని ఉండేందుకు వయోజన నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించారనే ఆరోపణలపై క్రిమినల్ విచారణ కోసం మంగళవారం న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ కోర్టుకు హాజరయ్యారు. అంతకుముందు, అతన్ని మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయంలో అరెస్టు చేశారు. అమెరికా చరిత్రలో ఓ మాజీ అధ్యక్షుడిని క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. అయితే సుమారు గంటపాటు విచారణ అనంతరం ఆయనను విడుదల చేశారు. ఇప్పుడు ట్రంప్ వ్యక్తిగత హాజరుతో ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 4న జరగనుంది.
పోర్న్ స్టార్‌లకు నిధులు సమకూర్చడంపై మాన్‌హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ అతనిపై 34 నేరారోపణలు చేశారు. విచారణ సమయంలో ట్రంప్ నిర్దోషి అని అంగీకరించారు. అయితే కోర్టు అతనికి $1.22 మిలియన్ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు ఇవ్వనున్నారు. డోనాల్డ్ ట్రంప్ తన హాజరు సమయంలో వ్యాపార రికార్డులను తప్పుదారి పట్టించినందుకు 34 నేరారోపణలలో నిర్దోషి అని అంగీకరించాడు. ఎటువంటి ప్రకటన చేయకుండా కోర్టు గది నుండి నిష్క్రమించాడు.
Also Read: BJP Chief Bandi Sanjay: అర్ధరాత్రి వేళ బండి సంజయ్ అరెస్ట్
అంతకుముందు రోజు రెండు గంటల సమయంలో మాన్‌హాటన్ కోర్టులో హాజరు కావడానికి ట్రంప్ తన లాయర్లతో వచ్చారు. అక్కడ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ నిమిత్తం జస్టిస్ జువాన్ ఎం మెర్చన్ ముందు హాజరుపరిచారు. ఇక్కడ ఆయన ఎదుటే న్యాయవాది ఆరోపణలకు సంబంధించిన సీల్డ్ కవరు తెరిచి అభియోగాలు మోపారు. గతంలో న్యూయార్క్ కోర్టు.. మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ కేసును ఆమోదించింది. ఇదే కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చాడు. ట్రంప్‌పై ఉన్న ఆరోపణలన్నింటినీ కలిపితే న్యూయార్క్ చట్టం ప్రకారం.. వారికి గరిష్టంగా 136 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది.
పోర్న్ స్టార్‌కు నగదు బదలాయించిన కేసులో అరెస్టైన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విడుదలైన అనంతరం ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. మార్కిస్ట్ సిద్ధాంతాన్ని అనుసరించే తృతీయ ప్రపంచ దేశంగా అమెరికా మారుతోందని ఆరోపించారు. అమెరికాలో ఇలాంటి ఘటనలు మునుపెన్నడూ చూడలేదన్న ఆయన.. అమెరికా నాశనంవుతోందని, నరకానికి వెళ్తోందని అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికన్లంతా కలిసి కట్టుగా దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. ‘‘అమెరికాలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని ఎన్నడూ ఊహించలేదు. నేను చేసిన ఒకే ఒక నేరం.. దేశాన్ని నాశనం చేయాలనుకునే వారి నుంచి అమెరికాను కాపాడటమే’’అని ట్రంప్ చెప్పుకొచ్చారు.