US Dallas Air Show : ఎయిర్ షో లో ఢీ కొన్న రెండు యుద్ధ విమానాలు..వైమానిక ప్రదర్శనలో ప్రమాదం..!!

అమెరికాలో ఘోర్ ప్రమాదం జరిగింది. రెండు యుద్ధ విమానాలు ఢీ కొన్నాయి. డల్లాస్ నగరంలో నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగింది. అందరు చూస్తుండగానే..రెండు విమానాలు ఢీకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బోయింగ్ బీ 17 బాంబర్ యుద్ద విమానం, పీ 63 కింగ్ కోబ్రా యుద్ధం విమానం…ఈ రెండూ ఢీ కొన్నాయి. అయితే ఫైలెట్ల ఆరోగ్యం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే ప్రాణనష్టం మాత్రం […]

Published By: HashtagU Telugu Desk
America

America

అమెరికాలో ఘోర్ ప్రమాదం జరిగింది. రెండు యుద్ధ విమానాలు ఢీ కొన్నాయి. డల్లాస్ నగరంలో నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగింది. అందరు చూస్తుండగానే..రెండు విమానాలు ఢీకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బోయింగ్ బీ 17 బాంబర్ యుద్ద విమానం, పీ 63 కింగ్ కోబ్రా యుద్ధం విమానం…ఈ రెండూ ఢీ కొన్నాయి. అయితే ఫైలెట్ల ఆరోగ్యం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే ప్రాణనష్టం మాత్రం జరగనట్లు తెలుస్తోంది. వైమానిక ప్రదర్శన కావడంతో అక్కడికి వచ్చిన వీక్షకులు సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు. ఆ సందర్బంలోనే రెండు విమానాలు డీ కొన్నాయి. ఈ ప్రమాదం మొబైల్ ఫోన్లలో రికార్డు అయ్యింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఫైలెట్ల ఆరోగ్యం గురించి ఇంకా నిర్దారించలేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్టేషన్ వెల్లడించింది.

  Last Updated: 13 Nov 2022, 05:59 AM IST