Site icon HashtagU Telugu

US Cops: ఏకాకిపై ముగ్గురు పోలీసుల జులుం..వీడియో వైరల్!!

Uscops Imresizer

Uscops Imresizer

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు అమెరికా పోలీసు అధికారులు ఒక్కటయ్యారు. ఒక ఒంటరి వ్యక్తి నేలపై బోర్లా పడుకోబెట్టి ఇష్టానుసారంగా చితక బాదారు. ఒక పోలీసు అతగాడిని బలంగా పట్టుకోగా.. మరో పోలీసు తలపై బలంగా బాదుతున్నాడు. ఇంకో పోలీసు మాకాళ్ళపై తన్నుతున్నాడు.

ఈ అమానుష దాడిని అటువైపుగా వెళ్తున్న కొందరు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాము చేస్తున్న దౌర్జన్య కాండను వీడియో తీస్తున్న వ్యక్తులను బెదిరిస్తూ.. ఒక పోలీసు అధికారి కూర్చున్న చోటు నుంచే వార్నింగ్స్ ఇచ్చాడు. అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై మీడియాలో వాడివేడి చర్చ జరిగింది. దీంతో స్వయంగా అర్కాన్సాస్ స్టేట్ గవర్నర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమానుష దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు విధులకు రావొద్దని వారికి నిర్దేశించారు.

ఏం జరిగింది ? ఎందుకు కొట్టారు?

అర్కాన్సాస్ స్టేట్ లోని మల్బెరి నగరంలో ఉన్న ఒక గ్రోసరీ స్టోర్ లో ఒక వ్యక్తి షాపింగ్ కు వచ్చాడు. షాపింగ్ చేసే క్రమంలో .. స్టోర్ రూల్స్ గురించి చెప్పిన సిబ్బందిని ఆ వ్యక్తి బెదిరించాడు. సిబ్బంది ఇచ్చిన సమాచారం తో ముగ్గురు పోలీసులు .. స్టోర్ లోకి వెళ్లి అతడిని మందలించారు. అయినా అతడు పట్టించుకోకుండా.. పోలీసుల్లో ఒకరి తలపై పిడిగుద్దు గుద్ది.. తోసేసి కింద పడేసినట్లు చెబుతున్నారు. దీంతో దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని స్టోర్ బయటికి తీసుకెళ్లాక.. ముగ్గురు పోలీసులు కలిసి దారుణంగా కొట్టడాన్ని మనం వీడియోలలో చూడొచ్చు.