Israel Hamas War: ఇజ్రాయెల్‌లో అడుగు పెట్టిన US కమాండోలు

గాజాలో హమాస్ మిలిటెంట్లు అపహరించిన బందీలను బయటకు తీసుకొచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ అధికారుల్ని ఆదేశించారు.

Published By: HashtagU Telugu Desk
Israel Hmas War

Israel Hmas War

Israel Hamas War: గాజాలో హమాస్ మిలిటెంట్లు అపహరించిన బందీలను బయటకు తీసుకొచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ అధికారుల్ని ఆదేశించారు. ఆదేశాలకు అనుగుణంగా యూఎస్ కమాండోలు ఇజ్రాయెల్ లో అడుగుపెట్టాయి. గాజాలో హమాస్ చేతిలో ఉన్న బందీలను గుర్తించడంలో ఆ దేశానికి సహాయం చేయడానికి ఇజ్రాయెల్‌లో అమెరికా కమాండోలు మోహరించాయి.

ఇజ్రాయెల్‌ కు చురుకుగా సహాయం చేస్తున్నామని అన్నారు రక్షణ శాఖ సహాయ కార్యదర్శి క్రిస్టోఫర్. కమాండోల ప్రధాన పని అమెరికన్ బందీలతో సహా ఇతర బందీలను గుర్తించడం అని చెప్పారు. గాజాలోని బందీలను వెంటనే బేషరతుగా విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ హమాస్‌కు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే దేశంలో ఉన్న బృందంతో పాటు డజన్ల కొద్దీ యుఎస్ స్పెషల్ ఆపరేషన్స్ దళాలను ఇజ్రాయెల్‌కు పంపినట్లు యూఎస్ తెలిపింది. కాగా బందీలను రక్షించేందుకు అమెరికాతో పాటు అనేక ఇతర దేశాలు తమ ప్రత్యేక బలగాలను ఇజ్రాయెల్‌కు తరలించాయని నివేదిక పేర్కొంది.

Also Read: Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల్లో అతి చిన్న వ‌య‌స్కురాలు ఆమె..!

  Last Updated: 01 Nov 2023, 02:03 PM IST