Site icon HashtagU Telugu

US attacks Iran Nuclear Sites: ఇరాన్‌పై 3 అణు కేంద్రాలపై బాంబుల వర్షం

Iran Atatcked

Iran Atatcked

టెహ్రాన్: (US attacks Iran Nuclear Sites:) ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణానికి ఇప్పుడు అమెరికా అధికారికంగా జతకావడంతో మూడో ప్రపంచ యుద్ధం ముప్పు మరింత ముదురుతోంది. అమెరికా తన ఫైటర్‌ జెట్‌లతో ఇరాన్‌లోని మూడు కీలకమైన అణు కేంద్రాలపై తీవ్ర దాడి చేసింది.

ఈ దాడిలో ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అనే మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా మారాయి. భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. దాడి అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ – ‘‘అన్ని విమానాలు సురక్షితంగా తిరిగి వచ్చాయి. మా శూర వీరులకు అభినందనలు. ఇలాంటి దాడిని ప్రపంచంలో మరే సైన్యం చేయలేదు. ఇప్పుడు శాంతికి సమయం’’ అని తెలిపారు.

ఇరాన్‌పై దాడికి ముందు ట్రంప్ రెండు వారాల డెడ్‌లైన్ ఇచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం దౌత్యంగా పరిష్కరించుకోవాలని కోరుతూ అమెరికా ఈ సమయంలో జోక్యం చేసుకుంటుందని తెలిపారు. కానీ ఆ మాట చెప్పిన 48 గంటలకే అమెరికా దాడికి దిగింది. ఇది గలిగిన రాజకీయ పరమైన ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందో తెలిపే సూచకంగా మారింది.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కూడా ఇటీవలి ప్రకటనల్లో “అమెరికా దాడి చేస్తే, అది ఊహించని నష్టాలను ఎదుర్కొంటుంది” అని హెచ్చరించారు. దాడి నేపథ్యంలో ఇరాన్‌ నుండి బలమైన ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉంది.

ఇక అమెరికా ఈ సంఘర్షణలో ప్రత్యక్షంగా దిగడం ద్వారా ఈ సమస్య అంతర్జాతీయ స్థాయికి దూసుకెళ్లే అవకాశం ఉంది. రష్యా, చైనా లాంటి శక్తివంతమైన దేశాలు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ యుద్ధంలోకి దిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకవేళ ఈ క్రమంలోనే మిగతా దేశాలు కూడా ఇరాన్‌ వెనక నిలబడితే, అది మూడో ప్రపంచ యుద్ధం ముప్పును మరింత పెంచే అవకాశం ఉంది. యుద్ధం కేవలం మిడిల్ ఈస్ట్‌ పరిధిలోనే ఉండబోదని, ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

మరి ఇప్పటి నుంచే ప్రపంచం శ్వాస ఆగేలా చూస్తోంది – ఈ దాడుల తర్వాత ఇంకా ఏం జరుగబోతోందో చూడాల్సిందే!