Trending

Israel – US Army : రంగంలోకి అమెరికా ఆర్మీ ఎక్స్‌పర్ట్స్.. గాజాపై గ్రౌండ్ ఎటాక్‌కు ప్లానింగ్

Israel - US Army : ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 6వేల మందికిపైగా అమాయక గాజా ప్రజలు మరణించారు.

Published By: HashtagU Telugu Desk
Israel

Israel

Israel – US Army : ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 6వేల మందికిపైగా అమాయక గాజా ప్రజలు మరణించారు. అయితే గ్రౌండ్ ఎటాక్‌లో ఇజ్రాయెల్ ఆర్మీకి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. హమాస్ మిలిటెంట్లు బలంగా ప్రతిఘటిస్తున్నారు. ఆదివారం రాత్రి  నుంచి సోమవారం ఉదయం వరకు గాజా బార్డర్ లోని కొన్ని గ్రామాల్లోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రయత్నించినప్పటికీ.. హమాస్ మిలిటెంట్లు బలంగా దాడులు చేసి వెనక్కి నెట్టారు. ఈక్రమంలో రెండు చోట్ల మొత్తం నలుగురు ఇజ్రాయెలీ సైనికులు ప్రాణాలు(Israel – US Army) కోల్పోయారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈక్రమంలో తాత్కాలికంగా గ్రౌండ్ ఎటాక్ ను ఆపేసిన ఇజ్రాయెల్.. అగ్రరాజ్యం అమెరికా మద్దతును కోరింది. దీంతో హుటాహుటిన అమెరికా తన నేవీకి చెందిన ఉన్నతాధికారులను, స్పెషల్ గ్రౌండ్ ఆపరేషన్ ఎక్స్ పర్ట్స్ ను ఇజ్రాయెల్ కు పంపాలని నిర్ణయించింది. వీరు అందించే ప్రణాళిక ప్రకారం.. ఇకపై గాజా మీద ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్ చేయనుంది. ఇజ్రాయెల్ కు ఈక్రమంలో గైడెన్స్ చేయనున్న కీలకమైన అమెరికా సైనిక అధికారుల జాబితాలో యూఎస్ మెరైన్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ జేమ్స్ గ్లిన్ కూడా ఉన్నారు. ఐసిస్ ఉగ్ర సంస్థకు వ్యతిరేకంగా ఇరాక్ లోని ఫలూజాలో అమెరికా తరఫున గ్రౌండ్ ఆపరేషన్ ను లీడ్ చేసిన అనుభవం జేమ్స్ గ్లిన్ కు ఉంది. ఈమేరకు తాము ఇజ్రాయెల్ కు సైనిక సహాయ సహకారాలను అందిస్తున్న సమాచారాన్ని స్వయంగా అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మీడియాకు వెల్లడించారు. జనావాస ప్రాంతాల్లోని ఉగ్రవాదుల స్థావరాలను ఛేదించడం ఎలా అనే దానిపై ఇజ్రాయెల్ కు అమెరికా సైనిక నిపుణులు సలహాలు ఇస్తారని తెలిపారు. గాజాలో సాధ్యమైనంత మేర ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

Also Read: Maoists Letter : మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ.. పొంగులేటి, పువ్వాడపై తీవ్ర ఆరోపణలు

మరోవైపు సోమవారం రోజు సిరియాలోని అన్-టాన్ఫ్ వద్ద ఉన్న అమెరికా సైనిక శిబిరంపై డ్రోన్ దాడికి యత్నం జరిగింది. అయితే దాడి చేసేందుకు వచ్చిన ఆ రెండు డ్రోన్లను అమెరికా ఆర్మీ కూల్చేసింది. ఇటీవల ఇరాక్ లోని అమెరికా ఆర్మీ బేస్ పై కూడా మిస్సైల్ ఎటాక్స్  జరిగాయి. ఇంకోవైపు తాజాగా యెమన్ దేశంలోని హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సముద్రతీరంలోని అమెరికా యుద్ధ నౌకలపైకి క్రూయిజ్ మిస్సైళ్లతో దాడికి యత్నించారు. వాటిని అమెరికా ఆర్మీ అడ్డుకొని కూల్చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

  Last Updated: 24 Oct 2023, 01:50 PM IST
Exit mobile version