Free Palestine : పాలస్తీనా కోసం అమెరికా సైనికుడి ఆత్మహత్యాయత్నం

Free Palestine : వైమానిక దళ సైనికుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన అమెరికాలో కలకలం రేపింది.

Published By: HashtagU Telugu Desk
Free Palestine Min

Free Palestine Min

Free Palestine : వైమానిక దళ సైనికుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన అమెరికాలో కలకలం రేపింది. దేశ రాజధాని వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఎదుట చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేసింది. పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ అమానవీయ దాడులను చూసి సదరు అమెరికా సైనికుడు ఆగ్రహానికి గురయ్యాడు. వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఎదుట తనకు తానే నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది మంటలను ఆర్పి.. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ సైనికుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘నేను ఇకపై గాజాలో జరుగుతున్న మారణహోమంలో పాల్గొనను. పాలస్తీనా విముక్తి (Free Palestine) కావాలి.  గాజాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా నేను తీవ్రమైన చర్య తీసుకోబోతున్నాను. ఫ్రీ పాలస్తీనా’’ అని నిప్పంటించుకునే ముందు ఆ సైనికుడు నినాదాలు చేశాడని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తి సైనికుడా ? కాదా ? అనే విషయాన్ని యూఎస్ వైమానిక దళం ధ్రువీకరించలేదు. ఆ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాన్ని అమెరికా ప్రభుత్వం తొలగించింది.

Also Read : Anant Ambani Wedding : అనంత్ అంబానీ పెళ్లి.. 5 స్టార్ హోటళ్లు లేవని ఏం చేశారో తెలుసా?

గతేడాది అక్టోబరు 7 నుంచి పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో దాదాపు 29వేల మంది సామాన్య పౌరులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. ఈనేపథ్యంలో గత నాలుగు నెలలుగా అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఎదుట నిరంతరం నిరసనలు జరుగుతున్నాయి. యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆపాలనే డిమాండ్ హోరెత్తుతోంది. గాజ్రా – ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం కావడంతో కాల్పుల విరమణ పాటించాలని అంతర్జాతీయంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో గాజాలో తక్షణ కాల్పుల విరమణ ప్రతిపాదనపై ఈ నెల 20న ఓటింగ్ జరగగా వీటో అధికారాన్ని ఉపయోగించి అమెరికా దానిని తిరస్కరించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగాలనే తన సంకల్పాన్ని అమెరికా వ్యక్తీకరించింది. ఇజ్రాయెల్‌కు పెద్దఎత్తున ఆయుధాలను విక్రయించి అమెరికా లబ్ధి పొందుతోంది.

Also Read : Rs 2000 Notes: 2 వేల రూపాయల నోట్లపై ఆర్‌బీఐ మరోసారి కీలక ప్రకటన..!

  Last Updated: 26 Feb 2024, 10:42 AM IST