Site icon HashtagU Telugu

UPI in UAE: UAE లో UPI సేవలు: ప్రధాని మోడీ

UPI in UAE

UPI in UAE

UPI in UAE: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రెండు రోజుల పర్యటన కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మోడీకి సాదర స్వాగతం పలికారు అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ . ఇద్దరు నేతలు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అనంతరం ఆయనకు గౌరవ వందనం అందించారు.

ఇరువురు నేతలు విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించారు. కొత్త సహకార రంగాలపై చర్చించారు మరియు ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలపై సంతకాలు చేశారు. దేశంలో మొట్టమొదటి హిందూ రాతి దేవాలయం నిర్మాణానికి భూమిని మంజూరు చేయడంలో అల్ నహ్యాన్ మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు . ఈ ఆలయం దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేకి అల్ రహ్బా సమీపంలో అబు మురీఖాలో ఉంది. సుమారు 27 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఆలయం కోసం భూమిని UAE ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది.

యుఎఇ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మోడీ భేటీ సందర్భంగా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, ఎలక్ట్రికల్ ఇంటర్‌కనెక్షన్ మరియు వాణిజ్య రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. డిజిటల్ రూపే క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ స్టాక్‌పై ఆధారపడిన దేశీయ కార్డ్ జయవాన్‌ను ప్రారంభించినందుకు మోడీ యుఎఇ అధ్యక్షుడిని అభినందించారు. జయవాన్ కార్డు ద్వారా జరిగిన లావాదేవీని ఇద్దరు నేతలు చూశారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు త్వరలో యుఎఇలో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మోడీ పేర్కొన్నారు.

Also Read: Aloe Vera For Beauty: వామ్మో.. కలబంద వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?