120 Million People Displaced : 12 కోట్ల మంది గూడు చెదిరింది.. ఐరాస సంచలన నివేదిక

ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ (యూఎన్‌ హెచ్‌సీఆర్) సంచలన నివేదికను విడుదల చేసింది. 

  • Written By:
  • Updated On - June 13, 2024 / 11:10 AM IST

120 Million People Displaced : ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ (యూఎన్‌ హెచ్‌సీఆర్) సంచలన నివేదికను విడుదల చేసింది.  ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, హింసాకాండల కారణంగా గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 12 కోట్ల మంది ప్రజలు బలవంతంగా నిరాశ్రయులయ్యారని ఈ నివేదిక తెలిపింది. ఈ సంఖ్య జపాన్ దేశ జనాభాకు సమానమని వెల్లడించింది. ‘ఫ్లాగ్‌‌షిప్ గ్లోబల్ ట్రెండ్స్’ పేరుతో ఓ నివేదికను యూఎన్ఓ హైకమిషనర్ ఫిలిప్పో గ్రాండి గురువారం ఉదయం విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join

నివేదికలోని కీలక అంశాలు

  • సూడాన్‌లో అంతర్యుద్ధం కారణంగా 2023 సంవత్సరంలో దాదాపు కోటిన్నర మంది ప్రజలు తమ ఊళ్లను వదిలి వలస వెళ్లాల్సి వచ్చింది.  వీరిలో 90 లక్షల మంది దేశంలోనే వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు.మిగతా వారు చాద్, ఈజిప్ట్, దక్షిణ సూడాన్‌ వంటి పొరుగు దేశాలకు వలస వెళ్లారు.
  • గతేడాది డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మయన్మార్‌లలో అంతర్యుద్ధాల కారణంగా లక్షలాది మంది ఆయా దేశాల్లోనే నిరాశ్రయులయ్యారు.
  • ఇజ్రాయెల్ భీకర దాడుల వల్ల గాజా స్ట్రిప్‌లోని జనాభాలో దాదాపు 17 లక్షల మంది పాలస్తీనాలోనే నిరాశ్రయులయ్యారు.
  • రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో గతేడాది దాదాపు 7.50 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.
  • గతేడాది అంతర్యుద్ధాలతో వణికిపోయిన మరో దేశం సిరియా. ఈ దేశంలో దాదాపు 1.3 కోట్ల మంది(120 Million People Displaced) ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు నిరాశ్రయులుగా మారిన దేశం ఇదే.  ఈ దేశంలో అమెరికా, రష్యా, టర్కీ, ఇరాన్ దేశాలు సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలను అంతం చేసేందుకు సిరియాలో ఈ దేశాలు సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాయి.

Also Read :Salman Khan : ఇంటిపై కాల్పుల వ్యవహారం.. సల్మాన్‌ఖాన్ సంచలన స్టేట్మెంట్

హమాస్ ఇటీవల ఇజ్రాయెల్‌కు కీలకమైన వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్​ బలగాలు దూకుడు తగ్గించకుండా ముందుకు దూసుకొస్తే బందీలను కాల్చేయాలని హమాస్​ తన సభ్యులకు ఆదేశాలు జారీచేసింది. ఇజ్రాయెలీ బందీల కోసం గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టింది.ఈనేపథ్యంలో హమాస్ ఈ ప్రకటన చేసింది. ఇటీవల సెంట్రల్ గాజాలోని నలుగురు ఇజ్రాయెలీ బందీలను విడిపించడానికి ఇజ్రాయెల్ సైన్యం 274 మంది గాజా ప్రజలను చంపేసింది. ఈ తరుణంలో ఇజ్రాయెల్ ఆర్మీపై హమాస్ ఆగ్రహంతో రగిలిపోతోంది.

Also Read : New Ration Card : కొత్త రేషన్‌కార్డుకు అప్లై చేశారా ? కొత్త అప్‌డేట్ ఇదిగో