History Will Judge : చరిత్రే తీర్పు చెబుతుంది.. ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఐరాస చీఫ్ వ్యాఖ్య

History Will Judge : గాజాపై దాడులు ఆపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎన్నిసార్లు పిలుపునిచ్చినా ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది.

  • Written By:
  • Publish Date - October 28, 2023 / 03:11 PM IST

History Will Judge : గాజాపై దాడులు ఆపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎన్నిసార్లు పిలుపునిచ్చినా ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది. ఏకంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ను రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకోవాలని రెండు రోజుల క్రితమే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి వివాదాస్పద ప్రకటన చేశారు. ఇవాళ గాజాపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో ప్రస్తుతం గ్రౌండ్ ఎటాక్ కూడా చేస్తోంది. ఈనేపథ్యంలో ఇవాళ స్పందించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్.. ‘‘గాజాలో ఇజ్రాయెల్ మారణహోమాన్ని ఆపకపోతే  చరిత్ర మనందరినీ తప్పుడు కోణంలో చూపిస్తుంది. కనీసం ఇప్పటికైనా ఇజ్రాయెల్ స్పందించాలి. మానవతావాద వైఖరితో కాల్పుల విరమణకు అంగీకరించాలి. హమాస్ కూడా బేషరతుగా బందీలందరినీ విడుదల చేయాలి. గాజా ప్రజలకు సహాయక సామగ్రి పంపిణీని వేగవంతం చేయాలి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘పాలస్తీనా ప్రజలందరినీ ఒకేగాటన కట్టి సమిష్టి శిక్ష విధించేలా దురాక్రమణ భావజాలంతో ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది’’ అని ఐరాస చీఫ్ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ఇజ్రాయెల్, హమాస్ వెంటనే స్పందించాలి. ఇది నిజం తరఫున నిలబడాల్సిన క్షణం. ఒకవేళ  ప్రపంచం అలా చేయలేకపోతే..చరిత్ర మనందరినీ తప్పుడు కోణంలో చూపిస్తుంది’’ అని ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. గాజాలో కాల్పుల విరమణపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన  తీర్మానంపై మొత్తం 193 సభ్య దేశాలకుగానూ 120 అనుకూలంగా ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్‌తో పాటు దాదాపు 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.  అయితే మెజారిటీ ఓట్లతో తీర్మానం ఆమోదించబడింది. మిలిటెంట్ గ్రూప్ హమాస్.. UN తీర్మానాన్ని (History Will Judge) స్వాగతించింది.

Also Read: Election Effect: రూ.200 కోట్ల విలువైన డబ్బు, మద్యం, బంగారం సీజ్