Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. ఏకంగా 100 క్షిపణులతో అటాక్..?

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య భీకర యుద్దం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 29, 2022 / 09:38 PM IST

Ukraine War: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య భీకర యుద్దం జరుగుతోంది. రెండు దేశాలు యుద్దంపై వెనుకకు తగ్గకపోవడంతో.. భారగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. నెలలుగా జరుగుతోన్న ఈ భయంకర యుద్దం వల్ల రెండు దేశాలు నష్టపోతున్నాయి. యుద్దం విరమించాలని రెండు దేశాలకు అన్ని దేశాలు చెబుతున్నాయి. శాంతిని నెలకోల్పాలని సూచిస్తున్నాయి. కానీ రష్యా,ఉక్రెయిన్ ఎవరి మాట వినడం లేదు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.

తాజాగా ఉక్రెయిన్ పై ఏకంగా 100 క్షిపణులతో రష్యా మూప్పేట దాడికి దిగింది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ దద్దరిల్లింది. కీవ్ తో పాటు చుట్టుపక్కల నగరాలన్నీ ఈ క్షిపణుల దాడితో చిరుగుటాకులు వణికాయి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కార్యాలయ సలహాదారు ఒలెక్సీ ఈ మూకుమ్మడి దాడులపై ప్రకటన చేశారు. కివీ, జైతోమిర్, ఓడెసా సిటీలలో పేలుళ్లు జరిగాయని, విద్యుత్ వ్యవస్ధకు నష్టం జరగకుండా ఉండేందుకు ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు.

10 పాయింట్లతో కూడిన శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రతిపాదించాడు. బలగాలను ఉపంసహరించుకోవాలని, యుద్దాన్ని ఆపేయాలని రష్యాకు సూచించాడు. కానీ ఉక్రెయిన్ శాంతి ఒప్పందాన్ని క్రెమ్లిన్ నిరాకరించింది. ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడానికి ఒప్పుకోవాల్సిందేని తేల్చిచెప్పింది. ఇలాంటి తరుణంలో ఏకంగా 100 క్షిపణులతో ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడటంతో రాజధాని కివీతో పాటు పలు సిటీలు దద్దరిల్లాయి.

ప్రజలను లక్ష్యంగా చేసుకుని రష్యా తమ దేశంపై క్షిపణులతో దాడి చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. తమ నగరాలు, పట్టణాలు, మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే టార్గెట్ గా రష్యా దాడులు చేస్తోందని చెబుతోంది. అయితే ఉక్రెయిన్ చేస్తున్న ఆరోపణలను రష్యా పూర్తిగా ఖండిస్తోంది. ఈ దాడులు ఇంకెన్ని రోజులు జరుగుతాయో చూడాలి.