Ukraine- Russia: రష్యా ఉక్రెయిన్‌పై (Ukraine- Russia) పెద్ద ఎత్తున దాడి చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ స్వయంగా దీనిని ధృవీకరించారు. దాడి తర్వాత అగ్నిమాపక ప్రయత్నాలు, శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది అత్యంత పెద్ద ఎత్తున జరిగిన వైమానిక దాడులలో ఒకటి. మొత్తం 550 లక్ష్యాలను ప్రయోగించారు. వీటిలో కనీసం 330 రష్యన్-ఇరానియన్ “షహీద్” డ్రోన్లు ఉన్నాయి.
జెలెన్స్‌కీ తెలిపిన వివరాల ప్రకారం.. దాడిలో బాలిస్టిక్ మిస్సైల్స్‌తో సహా అనేక మిస్సైల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని ముఖ్య నగరాలు, ప్రాంతాలలో గత రాత్రి వైమానిక దాడి హెచ్చరికలు దాదాపు అదే సమయంలో ప్రారంభమయ్యాయి. అప్పుడు మీడియా నివేదికలు అధ్యక్షుడు ట్రంప్, పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ గురించి చర్చించాయి. రష్యా మరోసారి తన యుద్ధం, ఉగ్రవాదాన్ని ముగించాలనే ఉద్దేశ్యం లేనట్లు చూపిస్తోంది.
Also Read: Cold : వర్షాకాలం తరచూ జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? టాబ్లెట్ వాడకుండానే ఉపశమనం పొందండిలా?
జెలెన్స్‌కీ ప్రకారం.. ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో కీవ్‌లో వైమానిక దాడి హెచ్చరిక ముగిసింది. ఇది ఒక క్రూరమైన, నిద్ర లేని రాత్రి. రాజధాని ఈ రష్యన్ దాడికి ప్రధాన లక్ష్యంగా ఉంది. మా యోధులు 270 వైమానిక లక్ష్యాలను కూల్చివేయగలిగారు. అయితే మరో 208 డ్రోన్లు ఎలక్ట్రానిక్ యుద్ధం ద్వారా జామ్ చేయబడ్డాయి. ఇంటర్‌సెప్టర్ డ్రోన్లు డజన్ల కొద్దీ డ్రోన్లను కూల్చివేశాయి. మా నగరాల రక్షణ కోసం ఈ అంశాన్ని అభివృద్ధి చేయడానికి మేము సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
జెలెన్స్‌కీ X పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు రష్యన్ దాడి కీవ్‌తో పాటు ద్నీప్రో, సుమీ, ఖార్కివ్, చెర్నిహివ్, కీవ్ ప్రాంతాలను కూడా ప్రభావితం చేసింది. ఇప్పటివరకు 23 మంది గాయపడినట్లు సమాచారం. వారందరికీ సహాయం అందిస్తున్నారు. డ్రోన్లు, మిస్సైల్స్ శిథిలాలు పడిన అనేక ప్రాంతాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ నేరుగా కూడా దాడులు జరిగాయి.