Russia Vs Ukraine : 2022 సంవత్సరం ఫిబ్రవరి 24 నుంచి రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో 2024 సెప్టెంబరు 29 వరకు తాము మొత్తం 6.51 లక్షల మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. ఈ యుద్ధంలో రష్యా 8,869 యుద్ధ ట్యాంకులు, 17,476 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్, 25,495 సైనికవాహనాలు, ఫ్యూయెల్ ట్యాంక్స్‌ను నష్టపోయిందని వెల్లడించింది. వీటితో పాటు 18,795 ఆర్టిల్లరీ సిస్టమ్స్, 1,204 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, 962 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, 369 యుద్ధ విమానాలు, 328 హెలికాప్టర్లు, 16,186 డ్రోన్లు, 28 నౌకలు, బోట్లు, 1 సబ్ మెరైన్‌ను రష్యా కోల్పోయిందని ఉక్రెయిన్ ఆర్మీ(Russia Vs Ukraine) తెలిపింది.
Also Read :CJI Chandrachud : ‘యా’ అనొద్దు.. ఇది కాఫీ షాపు కాదు.. లాయర్‌పై సీజేఐ ఆగ్రహం
రష్యాపై ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు నాటో కూటమి దేశాలు, ఐరోపా దేశాలు, అమెరికా అండదండలు అందిస్తున్నాయి. సైనిక సాయాన్ని, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. వాటి వల్లే గత రెండేళ్లుగా ఉక్రెయిన్ ఆర్మీ పోరాటాన్ని కంటిన్యూ చేయగలుగుతోంది. ఒకవేళ ఆయా చోట నుంచి మద్దతు లభించకుంటే ఉక్రెయిన్ పరిస్థితి మరోలా ఉండేది. తాజాగా డెన్మార్క్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు రూ.1600 కోట్ల సైనిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. మరో ఐరోపా దేశం నార్వే కూడా ఉక్రెయిన్ సరిహద్దు రక్షణకు మద్దతు ఇస్తామని వెల్లడించింది. అమెరికా ఇప్పటికే పెద్దమొత్తంలో ఉక్రెయిన్‌కు సాయం చేసింది. ఏకంగా కొన్ని యుద్ధ విమానాలను కూడా అందించింది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన వారికి కొన్ని ఐరోపా దేశాలలో ఈ యుద్ధ విమానాలు నడిపే ట్రైనింగ్‌ను సైతం అమెరికాయే స్పాన్సర్ చేసింది. ఈ దన్నుతోనే ఉక్రెయిన్ నేటికీ రష్యాను ప్రతిఘటించగలుగుతోంది. లేదంటే రష్యా అపారమైన సైనిక శక్తి ఎదుట ఉక్రెయిన్ నిలిచే అవకాశమే ఉండేది కాదు. దీన్ని గ్రహించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్‌కు చేయూత అందిస్తున్న దేశాలకు పదేపదే వార్నింగ్స్ ఇస్తున్నారు. ఆయా దేశాల లాంగ్ రేంజ్ మిస్సైళ్లను తమ దేశంపై ప్రయోగిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు.