Site icon HashtagU Telugu

Uganda Minister: మంత్రిని కాల్చి చంపిన అంగరక్షుడు.. అనంతరం ఆత్మహత్య చేసుకున్న బాడీగార్డ్

Uganda Minister

Resizeimagesize (1280 X 720) (2)

ఉగాండా (Uganda)లో మంగళవారం ఓ అంగరక్షుడు (Bodyguard) ప్రభుత్వ మంత్రి (Minister)ని కాల్చి చంపాడు. మీడియా కథనాల ప్రకారం.. వ్యక్తిగత వివాదంతో అంగరక్షకుడు మంత్రిని కాల్చాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కార్మిక శాఖ డిప్యూటీ మంత్రిగా ఉన్న రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఒకెల్లో అంగోలాని మంగళవారం ఉదయం అతని ఇంటి వద్ద అంగరక్షుడు కాల్పులు జరిపాడు. మంత్రిని కాల్చిచంపిన తర్వాత ఆ సైనికుడు కూడా తనను తాను కాల్చుకున్నాడు. కొందరు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. సైనికుడు తనను తాను కాల్చుకునే ముందు కూడా గాలిలోకి కాల్పులు జరిపాడు. అయితే సైనికుడికి, మంత్రికి మధ్య వాగ్వాదం ఏమి జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ ఘటనతో మంత్రి చుట్టూ ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉగాండా పార్లమెంటు స్పీకర్ ఉదయం సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కల్నల్ అంగోలా మరణాన్ని సంక్షిప్త ప్రకటనలో ధృవీకరించారు. అనితా అమంగ్ మంగళవారం ఎంపీలతో మాట్లాడుతూ గౌరవనీయమైన అంగోలాను తన అంగరక్షకుడు కాల్చిచంపారని, ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నారనే బాధాకరమైన వార్త ఈ ఉదయం నాకు అందిందని అన్నారు. అతని ఆత్మకు శాంతి కలుగుగాక. ఇది దేవుని ప్రణాళిక. మనం దేనినీ మార్చలేము అని అన్నారు.

Also Read: Donald Trump: ట్రంప్ పై మరో మహిళ ఆరోపణ.. అమెరికా మాజీ అధ్యక్షుడు నన్ను లైంగికంగా వేధించారు..!

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన సైనికుడి పేరు విల్సన్ సబిజిత్. రాజధాని కంపాలాలోని మంత్రి నివాసంలో నిన్న జరిగిందీ ఘటన. ఈ ఘటనకు ముందు వారి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అన్న విషయంలో స్పష్టత లేదు. సబిజిత్‌ను నెల రోజుల క్రితమే మంత్రి సెక్యూరిటీగా నియమించారు. కాగా, వేతనం చెల్లించకపోవడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. మంత్రి, అంగరక్షకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అనుమానం ఉన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.