Site icon HashtagU Telugu

Telugu Student Killed: విషాదం.. చికాగో కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి

Shooting In Philadelphia

Open Fire

ఉన్నత చదువుల కోసం అమెరికా (America)కు వెళ్లిన తెలుగు విద్యార్థులపై దుండగులు కాల్పులు జరిపారు. చికాగోలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో సాయి చరణ్, దేవాన్ష్‌ అనే తెలుగు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దేవాన్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దేవాన్ష్ స్వస్థలం విజయవాడ. సంగారెడ్డికి చెందిన సాయి చరణ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

దేవాంశ్, సాయి చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు చికాగోలో వాల్‌మార్ట్‌కు వెళుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. సౌత్ సైడ్‌లోని ప్రిన్స్‌టన్ పార్క్‌లో ఆదివారం రాత్రి జరిగిన సాయుధ దోపిడీలో వారు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ దేవాన్ష్ మృతి చెందగా, సాయి చరణ్ పరిస్థితి నిలకడగా ఉంది. ఒక్కసారిగా దుండగులు కాల్పులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దేవాన్ష్, సాయిచరణ్ శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. అయితే.. తీవ్రగా గాయపడిన వీళ్లిద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Also Read: Robbery: సినిమాలకు మించిన ట్విస్ట్: డబ్బు కొట్టేసి, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని పరార్!

కానీ.. దేవాన్ష్ చనిపోయాడు. సాయిచరణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. దేవాన్ష్ చదువు కోసం అమెరికా వెళ్లి కేవలం పది రోజులే అయినట్టు సమాచారం. కాగా.. ఈ విషయం తెలిసి దేవాన్ష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం అతని స్నేహితుల ద్వారా తెలుసుకున్న సాయి చరణ్ తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేలా చూడాలని సాయి చరణ్ పేరెంట్స్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.