Twitter Boss Vs Canada PM : ఖలిస్థాన్ ఉగ్రవాదులకు కెనడాలో ఆశ్రయం కల్పిస్తున్న ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వివాదాల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఈవిషయంలో భారత్ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ట్రూడో పై ఇప్పుడు ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ కూడా విరుచుకుపడ్డారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కంపెనీలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సిందే అంటూ ట్రూడో ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఆన్‌లైన్ సెన్సార్‌షిప్ నిబంధనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. వీటిని ఖండిస్తూ ప్రముఖ జర్నలిస్ట్ గ్లెన్ గ్రీన్‌వా ఇటీవల ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టారు.
We’re now on WhatsApp. Click to Join
దీనిపై ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘కెనడాలో వాక్ స్వాతంత్ర్యాన్ని ట్రూడో అణచివేస్తున్నారు. ఇది సిగ్గుచేటు’’ అని ఫైర్ అయ్యారు. ట్రూడోపై ఎలాన్ మస్క్ విమర్శలు చేయడం కూడా కొత్తేం కాదు. గత ఏడాది ఫిబ్రవరిలో ట్రూడోను హిట్లర్‌తో పోలుస్తూ ట్విటర్‌లో మస్క్ పోస్ట్ పెట్టారు. అయితే కొద్ది సేపటికే దానిని డిలీట్ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్లను తప్పనిసరి చేస్తూ 2022 ఫిబ్రవరిలో కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలను అక్కడి ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీరిని అణచివేసేందుకు కెనడా చరిత్రలోనే ట్రూడో తొలిసారి ఎమర్జెన్సీ అధికారాలను (Twitter Boss Vs Canada PM) అమలు చేశారు.