Turkey: ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నందుకు టర్కీలో కోకాకోలా, నెస్లే నిషేధం

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా వేలాది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలు, చిన్నారుల మరణాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ , హమాస్ ఏ మాత్రం తగ్గడం లేదు.

Turkey: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా వేలాది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలు, చిన్నారుల మరణాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ , హమాస్ ఏ మాత్రం తగ్గడం లేదు. తమ పంతం కారణంగా ఇరు ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. ఈ యుద్ధం కారణంగా ప్రముఖ శీతల పానీయాల కంపెనీ కోకాకోలా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తోందని ఆరోపిస్తూ కోకాకోలా మరియు నెస్లే ఉత్పత్తులను తమ రెస్టారెంట్లలో విక్రయించకుండా నిషేధించేలా టర్కీ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా టర్కీ పార్లమెంట్ లో ఒక ప్రకటన విడుదల చేసి రెండు కంపెనీలకు పంపించింది. అయితే రెండు ప్రభావిత కంపెనీలు ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.

ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే కంపెనీల ఉత్పత్తులను ఇకపై పార్లమెంటు ఆవరణలోని రెస్టారెంట్లు, కెఫెటేరియాలు, టీహౌస్‌లలో విక్రయించరాదని నిర్ణయించినట్లు ప్రకటన పేర్కొంది. పార్లమెంట్ స్పీకర్ నుమాన్ కుర్తుల్మస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విశేషం ఏంటంటే ప్రజల డిమాండ్ మేరకే పార్లమెంట్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు గాజా స్ట్రిప్‌లో గత నెలలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 10,000 కు చేరింది. అందులో 4,100 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read: Punjab Farmer: లక్కీడ్రాలో రెండున్నర కోట్లు గెలుచుకున్న పేద రైతు