Donald Trump: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే తాను లావుగా కనిపిస్తానని, అందుకే బహిరంగ కార్యక్రమాల్లో దానిని ధరించనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడంపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, ఓ మీడియా ప్రతినిధి ట్రంప్‌ను ప్రశ్నించారు. తాను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే 20 పౌండ్ల బరువు పెరిగినట్లుగా కనిపిస్తానని, ఇది తనకు ఇష్టం […]

Published By: HashtagU Telugu Desk
President Trump on wearing a bulletproof vest

President Trump on wearing a bulletproof vest

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే తాను లావుగా కనిపిస్తానని, అందుకే బహిరంగ కార్యక్రమాల్లో దానిని ధరించనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడంపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, ఓ మీడియా ప్రతినిధి ట్రంప్‌ను ప్రశ్నించారు.

తాను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే 20 పౌండ్ల బరువు పెరిగినట్లుగా కనిపిస్తానని, ఇది తనకు ఇష్టం ఉండదని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు.

హత్యాయత్నం నేపథ్యంలో, బుల్లెట్ ప్రూఫ్ ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమే అన్నారు. ఈ విషయం తనను చాలామంది అడిగారని, ఈ విషయం ఆలోచించవలసిందే అన్నారు. కానీ తనకు దానిని ధరించడం ఇష్టం ఉండదని తెలిపారు. అలా చేస్తే మనం ఒక చెడుశక్తికి లొంగిపోయినట్లు అవుతుందని అన్నారు.

మరోసారి దాడి జరుగుతుందేమోనన్న ఆందోళన ఉందా? అని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అలాంటి వాటి గురించి తాను ఆలోచించనని స్పష్టం చేశారు. వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటే తాను తన పనిని సక్రమంగా నిర్వర్తించలేనని ట్రంప్ తెలిపారు.

  Last Updated: 01 May 2026, 12:12 PM IST