అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చెప్పడం ఆలస్యం..సంచలన నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూ.. కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదం(Donald Trump 1st Slogan)తో తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించేందుకు చర్యలు చేపట్టి షాక్ ఇచ్చాడు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అక్రమంగా ఉంటున్న వారంతా తట్టాబుట్టా సర్దుకొని వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే భారత్ (India).. ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికాలో అక్రమంగా జీవిస్తున్న 18 వేల మంది భారతీయులను తిరిగి ఇండియా తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
Rural Development: గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీఠ.. రూ. 2773 కోట్లు మంజూరు!
ఇదిలా ఉండగానే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోని షాక్ ఇచ్చాడు ట్రంప్. అక్రమ వలసదారులు స్కూళ్లు, చర్చిలు, ఆస్పత్రులు, పెళ్లిళ్లు, దహన సంస్కారాలు లాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్నా సరే అరెస్టు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2011లోని నిబంధనను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎత్తివేసింది. క్రిమినల్స్ ఎక్కడ దాక్కున్నా వదలబోమంది. దీంతో అక్రమంగా ఉంటున్న వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. వీరు మాత్రమే కాదు మిగతా వలస వారు సైతం ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటారో..? సొంత దేశానికి వెళ్లిపోవాల్సిందేనా..? అంటూ మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద ట్రంప్ వస్తే ఏంజరుగుతుందో ముందు ఊహించినట్లు జరుగుతుంది.