Site icon HashtagU Telugu

Donald Trump : బ్రిక్స్ దేశాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Trump Warns Extra 10% Tarif

Trump Warns Extra 10% Tarif

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా BRICS దేశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్వంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో సోమవారం ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం.. BRICS గూటికి చేరే దేశాలపై ఇకపై 10 శాతం అదనపు దిగుమతి సుంకాన్ని విధిస్తామన్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రంప్ హెచ్చరికలు ముఖ్యంగా భారత్‌కు కూడా వర్తిస్తాయా అనే అంశంపై రాజకీయ, వాణిజ్య విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Hyderabad : విద్యా వాగ్దానాలు వృథా…ఇంకా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు !

‘‘అమెరికా వ్యతిరేక విధానాలు’’ అనే వ్యాఖ్యలు ఏమిటన్నదానిపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. అయితే గతంలో భారత్ కొన్ని సందర్భాల్లో అమెరికా అభిమతానికి భిన్నంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేసినప్పటికీ అమెరికా భారతపై ఆంక్షలు విధించలేదు. ఈ నేపథ్యాన్ని చూస్తే ట్రంప్ తాజా వ్యాఖ్యలు భారతదేశాన్ని కూడా ఉద్దేశించినవే కావచ్చని భావిస్తున్నారు. గతంలో BRICS దేశాలు అమెరికా ఏకపక్ష ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Tahawwur Rana : ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో కీలక మలుపు..నేరం అంగీకరించిన తహవ్వూర్ రాణా…

ఇక ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్‌లో జరిగిన 17వ BRICS శిఖరాగ్ర సదస్సులో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డి సిల్వాకు ఈ సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండోనేసియా BRICS లో చేరిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. మోదీ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్ దేశాలు అనేక దశాబ్దాలుగా ప్రపంచ వేదికలపై విస్మృతిలోకి వెళ్లిపోయాయని, అందువల్ల అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలు అవసరమని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలక వేదికగా BRICS తన ప్రాధాన్యతను మరింత పెంచుకుంటోంది.