Site icon HashtagU Telugu

Trump: ట్రంప్ అల్టిమేటం.. జూలై 9 డెడ్‌లైన్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై క్లారిటీ

Donald Trump

Donald Trump

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల గడువు జూలై 9తో ముగియనుంది. ఈ డెడ్‌లైన్‌ ఇకపై పొడిగించే అవకాశం లేదని ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా తెలిపారు. ఉల్లంఘన జరిగితే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తాయని ఆయన హెచ్చరించారు.

అమెరికా వాణిజ్య శాఖ ఇప్పటికే తైవాన్ నుంచి యూరోపియన్ యూనియన్ వరకు అనేక దేశాలకు లేఖలు పంపే ప్రక్రియ ప్రారంభించింది. శుక్రవారం నుంచి వాణిజ్య భాగస్వాములందరికీ కొత్త టారిఫ్ రేట్ల వివరాలు తెలియజేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

ఇక అధికారులు సంకేతాల ప్రకారం, రాబోయే రోజుల్లో అమెరికా పలు కీలక వాణిజ్య ఒప్పందాలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం యూకే, వియత్నాం దేశాలతో అమెరికా ఒప్పందాలు చేసుకుంది. చైనా మాత్రం పరస్పర ఉత్పత్తులపై తాత్కాలికంగా సుంకాలు తగ్గించేందుకు అంగీకరించింది.

భారత్‌తో కూడ ఒక భారీ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఏప్రిల్ 2న ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయితే అనేక దేశాల నిరసనల నేపథ్యంలో ట్రంప్‌ వాణిజ్య చర్చలకు గడువు ఇస్తూ 90 రోజులు సుంకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇప్పుడు ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో ఒప్పందాలు ఖరారవ్వకపోతే కొత్తగా టారిఫ్‌లు అమల్లోకి రావడం ఖాయం. ఈ నేపథ్యంలో భారత్, చైనా, బ్రిటన్ వంటి దేశాలు అమెరికాతో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో భారత్-అమెరికా మధ్య డీల్‌ ఖరారవ్వే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Lalit Modi : లండన్‌లో లలిత్ మోదీ గ్రాండ్ పార్టీ.. చిందిలేసిన విజయ్ మాల్యా