భార‌త్‌పై ట్రంప్ చిందులు!

వాస్తవానికి కెనడా, మెక్సికో, దక్షిణ అమెరికాలోని మెజారిటీ దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 36 దేశాలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రేడియో హోస్ట్ మైఖేల్ సేవేజ్ రాసిన వివాదాస్పద లేఖను రీ-పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో మైఖేల్ సేవేజ్ రాసిన ఒక లేఖను షేర్ చేశారు. ఇందులో భారత్, చైనా సహా ఇతర దేశాలను ‘హెల్ హోల్’ (నరకకూపాలు) అని పేర్కొంటూ తీవ్ర జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అమెరికాలోని ‘జన్మతః పౌరసత్వ’ చట్టంలో మార్పులు చేయాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు.

పౌరసత్వ చట్టంపై తీవ్ర విమర్శలు

అమెరికా సుప్రీంకోర్టులో జన్మతః పౌరసత్వంపై జరుగుతున్న చర్చపై సేవేజ్ స్పందిస్తూ.. అమెరికా పౌరులు కాని వారి పిల్లలకు కేవలం ఇక్కడ పుట్టినంత మాత్రాన పౌరసత్వం ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఈ విషయంపై కోర్టులు కాకుండా జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ఆయన కోరారు.

Also Read: WB Polling : పోలింగ్ కేంద్రానికి వచ్చిన భారీ ఏనుగు.. పరుగులు పెట్టిన ఓటర్లు

‘బర్త్ టూరిజం’పై వివాదాస్పద వ్యాఖ్యలు

వేరే దేశాల ప్రజలు అమెరికాకు వచ్చి ‘తొమ్మిదో నెలలో పిల్లలకు జన్మనిస్తారని’, దానివల్ల వారికి వెంటనే పౌరసత్వం లభిస్తుందని సేవేజ్ ఆరోపించారు. “ఇక్కడ పుట్టిన బిడ్డ వెంటనే పౌరుడైపోతాడు.. ఆ తర్వాత వారు తమ మొత్తం కుటుంబాన్ని చైనా, భారత్ లేదా ప్రపంచంలోని ఏదో ఒక ‘హెల్ హోల్’ నుండి ఇక్కడికి తీసుకువస్తారు” అని ఆయన లేఖలో రాశారు.

భారతీయ, చైనా వలసదారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు

ఈ లేఖలో భారతీయ- చైనా వలసదారులను ఉద్దేశించి ‘ల్యాప్‌టాప్ గ్యాంగ్‌స్టర్లు’ అని సంబోధించారు. వారు అమెరికా జెండాను అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత వ్యవస్థను బర్త్ టూరిజం, సంక్షేమ పథకాల దుర్వినియోగం కోసం వాడుకుంటున్నారని సేవేజ్ విమర్శించారు.

ట్రంప్ వాదన

జన్మతః పౌరసత్వం ఇచ్చే ఏకైక దేశం అమెరికా మాత్రమేనని ట్రంప్ గతంలో వాదించారు. అయితే వాస్తవానికి కెనడా, మెక్సికో, దక్షిణ అమెరికాలోని మెజారిటీ దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 36 దేశాలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఆధునిక కాలపు వలసల దృష్ట్యా అమెరికా రాజ్యాంగం పాతబడిపోయిందని సేవేజ్ తన లేఖలో అభిప్రాయపడ్డారు.

  Last Updated: 23 Apr 2026, 01:38 PM IST