మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు, గత వారాంతంలో హమాస్ సహా పలు దేశాలతో సానుకూల చర్చలు జరిగాయని, ముఖ్యంగా గాజాలో జరుగుతున్న యుద్ధం ముగింపు, బందీల విడుదల, మరియు మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన వంటి అంశాలపై చర్చలు విజయవంతమయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ చర్చలు అనుకున్న దిశగా సాగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది.
Grahanam Effect: గ్రహణ సమయంలో ఆలయాల్లో విగ్రహాలు శక్తి కోల్పోతాయా.. ఇందులో నిజమెంత?
ఈ చర్చల రెండో విడతను ఈజిప్టులో ఇవాళ నిర్వహించనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ వారంలోనే ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసే దిశగా అన్ని దేశాలు కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు. మధ్యప్రాచ్యంలోని సంక్షోభం పరిష్కారానికి ఈజిప్టు కీలక పాత్ర పోషిస్తోందని, మధ్యవర్తిగా వ్యవహరిస్తోందని దౌత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గాజాలో యుద్ధం కారణంగా నిరపరాధుల ప్రాణాలు కోల్పోతుండటంతో, వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సమయం చాలా విలువైంది. లేదంటే భారీ రక్తపాతం తప్పదు అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా శాంతి చర్చలను త్వరితగతిన పూర్తి చేయాలన్న దృఢ సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు. యుద్ధం మరింత దీర్ఘకాలం కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అమెరికా, ఈజిప్టు వంటి దేశాల సమన్వయంతో జరుగుతున్న ఈ చర్చలు మధ్యప్రాచ్యానికి శాంతి వాతావరణాన్ని తీసుకురావాలన్న ఆశలు పెరుగుతున్నాయి.
