Vivek Ramaswamy : వచ్చే సంవత్సరం (2025) జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన తన మంత్రివర్గం కోసం, కీలక ప్రభుత్వ పదవుల కోసం సన్నిహితులు, నమ్మకస్తులు, సమర్ధులైన వారిని ఎంపిక చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించాలని ట్రంప్ డిసైడయ్యారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీపడిన ట్రాక్ రికార్డు వివేక్ రామస్వామికి ఉంది. అద్భుత ప్రసంగాలతో ఎంతోమంది రిపబ్లికన్ల మనసులను గెలుచుకోవడంలో వివేక్ సక్సెస్ అయ్యారు. అందుకే ఆయనకు తన ప్రభుత్వంలో చోటు కల్పించాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) బాధ్యతలను వివేక్‌తో పాటు అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌లకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.
Also Read :Train Derailed : పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు బోల్తా.. పట్టాలు తప్పిన 11 బోగీలు
ఈసారి ట్రంప్ ఎన్నికల ఖర్చులకు మస్క్ భారీ విరాళాలను అందించారు. బహిరంగంగానే ట్రంప్‌కు అనుకూలంగా, బైడెన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలను చేశారు. ఎన్నికల ప్రచారం జరుగుతుండగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నేను ఎన్నికల్లో గెలిస్తే ఎలాన్ మస్క్‌కు వైట్ హౌస్‌లో కీలక బాధ్యతలు ఇస్తా’’ అని వెల్లడించారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. ప్రభుత్వశాఖల పనితీరు ఎలా ఉంది ? ఏమైనా లోపాలు ఉన్నాయా ? ఆ పనితీరును ఎలా మెరుగుపర్చాలి ? అనే అంశాన్ని ట్రాక్ చేయడమే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ విధి. దీన్ని కీలకమైన శాఖగా ట్రంప్ పరిగణిస్తున్నారు. అందుకే తనకు సన్నిహితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు(Vivek Ramaswamy) దాని పగ్గాలను అప్పగించారు.
Also Read :MS Dhoni: ఎంఎస్ ధోనీకి షాకిచ్చిన హైకోర్టు.. కోర్టుకు రావాల్సిందేనని నోటీసులు!
‘‘మస్క్, వివేక్ ఇద్దరు కలిసి ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తారు. అడ్డదిడ్డమైన నిబంధనలను తీసేస్తారు. అనవసర ఖర్చులను తగ్గిస్తారు. ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణంతో ముడిపడిన బాధ్యతలను నిర్వర్తిస్తారు. సేవ్ అమెరికా-2 ఉద్యమానికి ఇవి ముఖ్యమైనవి. వీరిద్దరూ నా పాలనకు లైన్ క్లియర్ చేస్తారు’’ అని ఈసందర్భంగా ట్రంప్ ప్రకటించారు.