Elon Musk : ట్రంప్ అధ్యక్షుడైతే ఎలాన్ మస్క్‌కు కీలక పదవి.. ఎందుకు ?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మాజీ దేశాధ్యక్షుడు ట్రంప్ గెలుస్తారా ?

  • Written By:
  • Updated On - May 30, 2024 / 08:55 AM IST

Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మాజీ దేశాధ్యక్షుడు ట్రంప్ గెలుస్తారా ? ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ గెలుస్తారా ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. ఇదే తరుణంలో ట్రంప్ కోటరీ వేగంగా పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ విరాళాలు అందించిన అపర కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ కూడా తనదైన శైలిలో వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకవేళ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే.. కీలకమైన పదవిని దక్కించుకోవడమే మస్క్ వ్యూహం సారాంశమని పరిశీలకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ కీలకమైన పదవి ఏమిటి ? అంటే.. వైట్ హౌజ్ అడ్వైజర్ పదవి. ఈ హోదాలో ఉండేవారు నేరుగా దేశ అధ్యక్షుడికి పాలనా విషయాల్లో సలహాలను ఇవ్వొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలే ట్రంప్, మస్క్‌లను  కలిపాయి. ఈ కలయిక వెనుక ఇద్దరూ వారివారి ప్రయోజనాలను చూసుకుంటున్నారు. ఎలాన్ మస్క్‌కు చాలా పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. అంతరిక్ష ప్రయోగాలు, వ్యోమ నౌకల తయారీ, ఉపగ్రహాల తయారీ వంటి కార్యకలాపాలపై మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ పనిచేస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే చాలా ప్రాజెక్టులను అమెరికా ప్రభుత్వ అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా నుంచి పొందింది. ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వస్తే.. ట్రంప్ కంపెనీలకు మరిన్ని అంతరిక్ష పరిశోధనల ప్రాజెక్టులు దక్కేందుకు లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.  స్టార్ లింక్ ఉపగ్రహాల ద్వారా విలువైన సమాచార రంగ సేవలను మస్క్ అందిస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని మస్క్ యోచిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడైతే ఈవిషయంలో తనకు పచ్చజెండా ఊపుతారని మస్క్ భావిస్తున్నారు. అందుకే ట్రంప్ ప్రభుత్వంలో కీలక పదవిని పొందాలని భావిస్తున్నారు. ఆ పదవిలో ఉంటూ తన కంపెనీల వ్యవహారాలను కూడా చక్కబెట్టుకోవచ్చని మస్క్(Elon Musk) అనుకుంటున్నారు.

Also Read :Votes Counting : జూన్ 4న ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా ?

వాస్తవానికి రెండేళ్ల క్రితం వరకు మస్క్, ట్రంప్ మధ్య పెద్దగా సఖ్యత లేదు. ఇందులో ట్విట్టర్ వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి.  ఎలక్ట్రిక్ వాహన రంగంపై, వాటిపై విధించాల్సిన పన్నుల  అంశాలపై ఇద్దరి అభిప్రాయాలు మ్యాచ్ కావు. అయితే ఈ అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొన్న ట్రంప్‌కు మస్క్ ఆపన్న హస్తం అందించారని తెలుస్తోంది. అందుకే ఎన్నికల్లో గెలిస్తే ఆయనకు కీలక పదవిని ట్రంప్ కట్టబెట్టే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.

Also Read : KCR Mark : కేసీఆర్ మార్క్‌ను చెరిపివేసే దిశగా కసరత్తు.. ఆ మార్పులే సంకేతం