Site icon HashtagU Telugu

Ukraine Partition : జర్మనీలా ఉక్రెయిన్‌ విభజన.. ట్రంప్ అనూహ్య ప్లాన్ ?!

Ukraine Partition Plan By Trump Envoy Ukraine Berlin Germany Russia

Ukraine Partition : రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. ఆ యుద్ధంలో రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లతో కూడిన సైనిక కూటమి గెలిచింది. అందుకే జర్మనీ దేశాన్ని ఆ నాలుగు దేశాలు కలిసి పప్పు,బెల్లంలా పంచుకున్నాయి. దీన్నిబట్టి ఈ దేశాలకు విదేశాల భూభాగంపై ఎంత ఆశ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్‌ను కూడా జర్మనీ తరహాలోనే విభజించే అవకాశం ఉందని సాక్షాత్తూ ఉక్రెయిన్‌‌లోని అమెరికా ప్రత్యేక రాయబారి విశ్రాంత జనరల్‌ కీత్‌ కెల్లాగ్‌ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే, ఉక్రెయిన్ విభజన తప్ప మరో మార్గం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘రష్యా సైన్యం ఇప్పటివరకు ఆక్రమించిన ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతాలపై రష్యా నియంత్రణ కొనసాగుతుంది. పశ్చిమ ఉక్రెయిన్‌ ప్రాంతంపై  బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక దళాల నియంత్రణ కొనసాగుతుంది’’ అని కీత్‌ కెల్లాగ్‌ చెప్పినట్లుగా ప్రచారం నడిచింది.

18 మైళ్ల బఫర్ జోన్.. 

‘‘రష్యా ఆధీనంలోని తూర్పు ఉక్రెయిన్.. బ్రిటన్, ఫ్రాన్స్ దళాలు ఉండే పశ్చిమ ఉక్రెయిన్‌ మధ్య 18 మైళ్ల మేర సైనికులు ఉండని బఫర్ జోన్‌ను ఏర్పాటు చేయాలి. తూర్పు, పశ్చిమ ఉక్రెయిన్‌ల మధ్య నిప్రో నది విభజన రేఖగా పనిచేస్తుంది. బఫర్ జోన్‌లోకి ఇరుపక్షాల సైనికులు ప్రవేశించకూడదు. ఫలితంగా ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండదు’’ అని కీత్‌ కెల్లాగ్‌ ప్రతిపాదించారట. అయితే ఆ తర్వాత ఈ ప్రచారాన్ని స్వయంగా కీత్‌ కెల్లాగ్‌ ఖండించారు. తాను ఉక్రెయిన్ విభజన గురించి కానీ, ఉక్రెయిన్‌ను జర్మనీతో పోల్చడం గురించి కానీ అస్సలు మాట్లాడలేదని పేర్కొంటూ ఒక ట్వీట్ చేశారు.

Also Read :Salman Khan: కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు

రష్యా, ఉక్రెయిన్ అంగీకరిస్తాయా ? 

కీత్‌ కెల్లాగ్‌ చేసిన ప్రతిపాదనలు ఒకవేళ నిజమైనవే అయితేే.. వాటిని ఉక్రెయిన్(Ukraine Partition), రష్యాలు అంగీకరించే ఛాన్సే లేదు. ఉక్రెయిన్‌ భూభాగంలో నాటో దళాల ఉనికిని తాము అస్సలు అంగీకరించమని గతంలో రష్యా చాలాసార్లు తేల్చి చెప్పింది.  ఉక్రెయిన్‌ సైతం తమ భూభాగంలో కొంచెం కూడాా రష్యాకు అప్పగించడానికి రెడీగా లేదు. దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలు తమవే అని ఉక్రెయిన్ వాదిస్తోంది. అయితే ఈ ప్రాంతాలన్నీ తమ దేశంలో విలీనం అయ్యాయని గతంలో రష్యా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Also Read :Laser Weapon: భారత్‌కు లేజర్ ఆయుధం.. కర్నూలులో ప్రయోగం సక్సెస్