Site icon HashtagU Telugu

Trump Tariffs : మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చిన ట్రంప్

Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) మరోసారి ప్రపంచ వాణిజ్య మార్కెట్‌ను కుదిపే నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల నుండి అమెరికాలోకి దిగుమతి అవుతున్న మిడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% టారిఫ్ (పన్ను) విధించనున్నట్లు ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అమెరికా ట్రక్కింగ్, ఆటోమొబైల్ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్టు ట్రంప్ తెలిపారు. అయితే, ఈ నిర్ణయం గ్లోబల్ వాణిజ్య సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Revanth Reddy : బీసీలకు 42% రిజర్వేషన్లు: సుప్రీంకోర్టు నిరాకరణ, రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గెలుపు

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టారిఫ్ పాలసీ మరింత దూకుడుగా మారింది. చైనా, మెక్సికో, భారత్ వంటి దేశాలపై ఇప్పటికే అడిషనల్ కస్టమ్స్ టారిఫ్స్ విధించారు. ఈ నిర్ణయాలతో అమెరికా ‘మేక్ ఇన్ యుఎస్‌ఏ’ విధానాన్ని బలోపేతం చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు మాత్రం ఉద్రిక్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా యూరప్, ఆసియా దేశాలు తమ ఆటోమొబైల్ ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ మాత్రం “టారిఫ్స్ వల్లే అమెరికా బలపడుతోంది, యుద్ధాలు ఆగుతున్నాయి” అంటూ తన నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

ఈ తాజా టారిఫ్ ప్రకటనతో ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త అనిశ్చితి వాతావరణం నెలకొంది. అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన కంపెనీలు కొత్త వ్యూహాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, ఆర్థిక నిపుణులు ఈ నిర్ణయం వల్ల అమెరికాలో ట్రక్కుల ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, దిగుమతి వ్యాపారులపై అదనపు భారముతో వినియోగదారులపై కూడా పరోక్షంగా ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి, ట్రంప్ టారిఫ్ రాజకీయాలు మళ్లీ గ్లోబల్ మార్కెట్‌లో చర్చనీయాంశమయ్యాయి.

Exit mobile version