Site icon HashtagU Telugu

Trump Sensation : అమెరికా రాజ్యాంగాన్ని రద్ధు చేయాలని ట్రంప్ డిమాండ్

Donald Trump

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెద్ద ఎత్తున మోసాలు జరిగాయంటూ మరోసారి ఆరోపించిన ట్రంప్ (Donald Trump). ఈసారి ఏకంగా రాజ్యాంగాన్ని రద్ధు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికలలో డెమోక్రాట్లు సెనేట్ పై మరింత ఆధిపత్యం సంపాదించి, ట్రంప్ మద్దతు కలిగిన రిపబ్లికన్లు ఓడిపోవడం తెలిసిందే. దీంతో ట్రంప్ పాత ఆరోపణలనే మరోసారి వినిపించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సహనాన్ని కోల్పోయారు. 2020లో హంటర్ బిడెన్ ల్యాప్ టాప్ కు సంబంధించి న్యూయార్క్ పోస్ట్ లో ప్రచురించిన కథనంపై ట్విట్టర్ అంతర్గత ఈ మెయిల్స్ వెలుగు చూసిన క్రమంలో ట్రంప్ స్పందించారు. ‘‘ఈ స్థాయిలో పెద్ద ఎత్తున మోసాలు జరగడం, అన్ని నిబంధనలు, నియంత్రణలను తుంగలో తొక్కడమే’’ అని ట్రంప్ పేర్కొన్నారు. డెమోక్రాట్లకు అనుకూలంగా టెక్నాలజీ దిగ్గజాలు వ్యవహరించినట్టు ట్రంప్ విమర్శించారు. ‘‘మన గొప్ప వ్యవస్థాపకులు మోసపూరిత, తప్పుడు ఎన్నికలను కోరుకోలేదు’’ అని ట్రంప్ తన వ్యక్తిగత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో పేర్కొన్నారు.