Site icon HashtagU Telugu

India Vs Canada : చేతికి కట్టుకున్న దారాలను చూపిస్తూ.. కెనడా ప్రధాని ట్వీట్

Trudeau Diwali Hindu Temples India Vs Canada

India Vs Canada : వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తనదైన శైలిలో పొలిటికల్ గేమ్‌కు తెరలేపారు. ఓ వైపు ఖలిస్తానీ ఉగ్రవాదులు, వేర్పాటు వాద సంస్థలకు బహిరంగంగా మద్దతు తెలుపుతూనే.. మరోవైపు  అక్కడి హిందూ ఓటర్ల చూపును తన వైపునకు తిప్పుకునేందుకు ట్రూడో యత్నిస్తున్నారు. ఈక్రమంలో ఇటీవలే ఆయన కెనడాలోని(India Vs Canada) మూడు హిందూ దేవాలయాలను సందర్శించి, దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడున్న హిందువులు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారితో ఫొటోలు, వీడియోలు దిగి తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసుకున్నారు.

Also Read :Electricity Ambulances : విద్యుత్ అంబులెన్సులు వచ్చేశాయ్.. ఎమర్జెన్సీలో కాల్ 1912

‘‘హ్యాపీ దీపావళి. ఈ వారం నేను కూడా పండుగ  సంబరాల్లో పాల్గొన్నాను. ప్రత్యేక క్షణాలు గడిపాను’’ అని కెనడా ప్రధాని ట్రూడో  తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఒక వీడియోలో ట్రూడో.. తన చేతికి కట్టుకున్న దారాలను  చూపించారు. తాను హిందూ దేవాలయాలను సందర్శించినప్పుడు చేతికి ఈ తాళ్లు కట్టారని తెలిపారు. అవి తనకు అదృష్టం, రక్షణ ఇస్తాయన్నారు. ఆ దారాలను తెగిపోయే దాకా తొలగించేది లేదని ట్రూడో స్పష్టం చేశారు. ‘‘ కెనడాలో ఇండియన్స్ లేకపోతే దీపావళి జరుపుకోవడం సాధ్యం కాదు. ఇండో-కెనడియన్స్ ఆర్టిస్టులుగా, వ్యాపారవేత్తలుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, లీడర్స్‌గా రాణిస్తున్నారు’’ అని ఆయన కొనియాడారు.

Also Read :IRCTC Special Trains : ‘దివ్య దక్షిణ్‌ యాత్ర’.. కార్తీక మాసంలో ఐఆర్‌‌సీటీసీ ప్రత్యేక ట్రైన్

భారత్‌-కెనడా సంబంధాలు దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రతిపక్ష నేత పియర్రె పొయిలీవ్రే ఈసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ది ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా కెనడా (ఓఎఫ్‌ఐసీ) పార్లమెంట్‌ హాల్‌లో నిర్వహించిన దీపావళి వేడుకలకు ఆయన హాజరుకాలేదు.  అయితే దీనిపై విమర్శలు రావడంతో ఆయన వైట్‌బైలో జరిగిన దీపావళి వేడుకల్లో  పాల్గొన్నారు. దీనికి భారీ సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. కెనడాలో ఖలిస్తానీల మర్డర్స్ వెనుక భారత గూఢచార సంస్థ ఏజెంట్లు ఉన్నారని కెనడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ వాదనను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఆ హత్యలతో తమకు సంబంధం లేదని తేల్చి చెబుతోంది.