Elon Musk: మస్క్ కీలక వ్యాఖ్యలు.. ఎంతైనా తిట్టుకోండి కానీ $8 కట్టండి..!

ఎలాన్ మస్క్‌ ట్విట్టర్ లో బ్లూటిక్‌ కావాలంటే $8 చెల్లించాలన్న రూల్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో

Published By: HashtagU Telugu Desk
elon musk

elon musk twitter

ఎలాన్ మస్క్‌ ట్విట్టర్ లో బ్లూటిక్‌ కావాలంటే $8 చెల్లించాలన్న రూల్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ నిర్ణయాన్ని సమర్థించుకున్న మస్క్‌ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ‘మీరు నన్ను ఎంతైనా తిట్టండి. కానీ 8 డాలర్లు చెల్లించాలి’ అని ట్వీట్‌ చేశారు. మరోవైపు ఉద్యోగాల కోతపై స్పందిస్తూ.. ‘ట్విట్టర్ నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు మరో మార్గం లేదు. ప్రస్తుతం $4 మిలియన్‌ చెల్లించాల్సి వస్తోంది’ అని పేర్కొన్నారు.

మరోవైపు ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా అబద్ధాలను పంపిస్తూ, సృష్టిస్తున్న సంస్థను ఎలాన్‌ మస్క్ కొన్నారు. ఎడిటర్స్ ఇక ఉండరు. ఏది ప్రమాదకరమో అర్థం చేసుకోగలిగే శక్తి పిల్లలకు ఉంటుందని ఎలా ఆశించగలం?’’ అని బైడెన్ అన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను 4,400 కోట్ల డాలర్ల ఒప్పందంతో కొనుగోలు చేశారు. సంస్థలో ఉద్యోగాలు కోల్పోతున్న వారందరికీ మూడు నెలల జీతాన్ని ‘వేర్పాటు వేతనం’గా చెల్లిస్తున్నట్లు ట్వీట్‌లో చెప్పారు.

  Last Updated: 05 Nov 2022, 10:31 PM IST