Site icon HashtagU Telugu

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ లో విషాదం…గుండె పోటుతో అభిమాని మృతి..!!

Wales

Wales

ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ప్రతిరోజూ జరిగే మ్యాచ్ లు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. ఫుట్ బాల్ మ్యాచులే కాదు వివాదాలు, ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వేల్స్ జట్టు అభిమాని గుండెపోటుతో మరణించాడు. ప్రపంచకప్ ను చూసేందుకు ఖతార్ కు వచ్చిన 62ఏళ్ల కేవిన్ డేవిస్ గుండె పోటుతో మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

ది మిర్రర్ కథనం ప్రకారం…కెవిన్ డేవిస్ 10 రోజుల క్రితం ఖతార్ వెళ్లాడు. ఇంగ్లాండ్, అమెరికా, ఇరాన్ లతో జరిగిన వేల్స్ మ్యాచ్ లను చూసేందుకు తన స్నేహితులు, కుటుంబంతో కలిసి ఖతార్ వచ్చాడు. వేల్స్ 0-2తో ఓడిపోయినప్పుడు కెవిన్ ఇరాన్ తో జరిగిన మ్యాచ్ ను చూడలేదు. హోటల్ గదిలో గుండెనొప్పితో పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కెవిన్ మరణం పట్ల ఫుట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ వేల్స్ సంతాపం వ్యక్తం చేసింది. అతన్ని జట్టుకు గొప్ప అభిమానిగా అభివర్ణించింది.

వేల్స్ కు ఈ ప్రపంచకప్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే 1958 తర్వాత వేల్స్ ఫిఫా ప్రపంచకప్ కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూసేందుకు కెవిన్ లాంటి వేలాది మంది అభిమానులు వేల్స్ నుంచి ఖతార్ కు చేరుకున్నారు.