Rains In Dubai: దుబాయ్‌లో కుండపోత వ‌ర్షాలు.. నీట మునిగిన మాల్స్‌, విమానాశ్రయాలు.. వీడియో..!

మంగళవారం (ఏప్రిల్ 16) కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లు, ఇళ్లు, మాల్స్ జలమయమయ్యాయి.

  • Written By:
  • Updated On - April 17, 2024 / 09:59 AM IST

Rains In Dubai: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అత్యంత ప్రధాన నగరాల్లో ఒకటైన దుబాయ్‌లో కుండపోత వర్షాలు (Rains In Dubai) జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. మంగళవారం (ఏప్రిల్ 16) కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లు, ఇళ్లు, మాల్స్ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా దుబాయ్‌లో వరదలు వచ్చాయి. గల్ఫ్‌లో తుపాను కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటలపాటు ఇక్కడి నుంచి విమానాలు బయలుదేరలేదు. రన్‌వే మోకాలి లోతు నీరు వ‌చ్చి చేరింది. వర్షం కారణంగా 50కి పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

దుబాయ్‌ని మిడిల్ ఈస్ట్ ఆర్థిక కేంద్రంగా పిలుస్తారు. అయితే ఈదురుగాలులతో కూడిన వర్షం నగర పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నగరంలోని ప్రధాన షాపింగ్ కేంద్రాలు దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌లోకి వరద నీరు చేరింది. మాల్‌లో జలపాతంలా నీరు ప్రవహించగా దుబాయ్ మెట్రో స్టేషన్‌లో నీరు కాలి మడమల లోతులో ఉంది. ఈ గల్ఫ్ నగరంలో వర్షం మామూలుగా లేదు. ఇక్కడ చాలా అరుదైన సందర్భాలలో వర్షాలు కురుస్తాయి. ఈ కారణంగానే మంగళవారం కుండపోత వర్షం కురవడం వల్ల రోడ్ల నుంచి ఇళ్ల వరకు అన్నీ మునిగిపోయాయి. ప్రజల ఇళ్లలోకి కూడా వర్షం నీరు చేరింది.

Also Read: Ayushman Bharat Card: మీకు ఆయుష్మాన్ భార‌త్‌ కార్డు ఉందా..? లేకుంటే ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..!

వర్షం కారణంగా UAE అంతటా పాఠశాలలు మూసివేయబడ్డాయి. బుధవారం కూడా మూసివేయనున్నారు. UAEలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల్లో 80 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసింది. దీంతో వరదలు ముంచెత్తే పరిస్థితులు ఏర్పడ్డాయి. దుబాయ్ ఎడారిలో ఉన్న నగరం. ఇక్కడ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వర్షాలు పడే చాలా త‌క్కువ‌. దీని కారణంగా భారీ వర్షాలకు ఇక్కడ మౌలిక సదుపాయాలు సిద్ధంగా లేవు. దీంతో మంగళవారం వర్షం కురవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది.

We’re now on WhatsApp : Click to Join

యూఏఈ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి బుధవారం దేశమంతటా మేఘాలు కమ్ముకోబోతున్నాయని హెచ్చరించింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. దుబాయ్, అబుదాబిలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం వడగళ్ల వాన కురిసింది. ఒక్క యూఏఈలోని దుబాయ్ నగరం మాత్రమే వర్షం కారణంగా కార‌ణంగా ఇబ్బంది ప‌డ‌లేదు. దేశంలోని ఇతర ఎమిరేట్స్‌లో కూడా వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. షార్జా, అజ్మాన్, రస్ అల్-ఖైమా, ఉమ్ అల్-కువైన్, ఫుజైరాలో కూడా వర్షం కురిసింది. వర్షం కారణంగా దుబాయ్‌లోని ప్రజలు ఇంటి నుండి పని చేయాలని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని కోరారు. వాహనాలు కూడా నీటిలో మునిగిపోవడం మనం వీడియోలో చూడ‌వ‌చ్చు.