Hafiz Saeed : గతంలో భారత్‌లో జరిగిన ఉగ్రదాడులతో లింకులున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు, స్వదేశంలోనే ఒకరి తర్వాత ఒకరుగా హత్యకు గురవుతున్నారు. ఈ సీరియల్ కిల్లింగ్స్‌ను ఎవరు చేస్తున్నారో పాక్ ప్రభుత్వానికి అంతుచిక్కడం లేదు. తాజాగా అబూ ఖతల్‌ను కొందరు మర్డర్ చేశారు. ఇతడు 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్(Hafiz Saeed)కు అత్యంత సన్నిహితుడు, రైట్ హ్యాండ్ లాంటివాడు. అబూ ఖతల్‌ను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్ చేశారు. ఇతడి కోసం భారత గూఢచార సంస్థలు ఎంతో కాలంగా వెతుకుతున్నాయి. అబూ ఖతల్ నిర్వహించే ఉగ్ర కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాయి.
Also Read :Aurangzebs Tomb: ఔరంగజేబు సమాధిపై వివాదం.. వీలునామాలో సంచలన విషయాలు
అబూ ఖతల్ ఉగ్రవాద నేపథ్యం
- 2023 జనవరి 1న జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని ధంగరి గ్రామంలో జరిగిన ఉగ్రదాడితోనూ అబూ ఖతల్(Hafiz Saeed)కు సంబంధం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తెలిపింది.
- మరుసటి రోజు జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు ఉగ్రదాడుల్లోనూ అబూ ఖతల్ పాత్ర ఉందని అంటారు.
- 2023 ఏప్రిల్ 20న కశ్మీరులోని భాటా ధురియన్ ప్రాంతంలో భారత సైన్యం లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారు.
- 2024 సంవత్సరం జూన్ 9న జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. శివ్ ఖోడి ఆలయం నుంచి తిరిగొస్తున్న యాత్రికుల బస్సుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అబూ ఖతల్ కీలక పాత్ర పోషించాడు. ఈ దాడిలో కొందరు యాత్రికులు చనిపోయారు.
- ఈ వరుస దాడుల్లో అబూ ఖతల్ హస్తం ఉందని గుర్తించిన భారత్.. అతడిని నిశితంగా ట్రాక్ చేస్తోంది.
- భారత్‌లోని జమ్మూకశ్మీరుతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీరులోని లష్కరే తైబా క్యాడర్‌కు సమన్వయకర్తగా అబూ ఖతల్ పనిచేసేవాడని అంటున్నారు. ఆ క్యాడర్‌కు రహస్యంగా ఆయుధాలు, డబ్బును సప్లై చేసేవాడని చెబుతున్నారు.