Tiger And Trump: డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలితో టైగర్ ప్రేమాయణం

తాను టైగర్‌తో(Tiger And Trump) డేటింగ్‌లో ఉన్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Tiger Woods Vanessa Trump Donald Trumps Daughter In Law

Tiger And Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ .. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు. ఈయన మాజీ కోడలు వెనెసా‌తో గోల్ఫ్‌ సూపర్‌స్టార్‌ టైగర్‌ వుడ్స్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈవిషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా టైగర్ వుడ్స్ ఒక పోస్ట్ పెట్టారు.  వెనెసాతో తాను డేటింగ్‌ చేస్తున్నానని ఆయన వెల్లడించారు. వెనెసాతో ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్టుగా ఉందన్నారు.  ఆమె తన పక్కనే ఉంటే జీవితం మరింత అద్భుతంగా ఉంటుందని వుడ్స్ పేర్కొన్నారు.  దీన్నిబట్టి వారిద్దరి మధ్య బంధం ఎంతగా బలపడిందో అర్థం చేసుకోవచ్చు. వెనెసాతో కలిసి దిగిన పలు ఫొటోలను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తమ ఇద్దరి బంధం విషయంలో వ్యక్తిగత గోప్యతను గౌరవించినందుకు సన్నిహితులకు టైగర్ వుడ్స్  థ్యాంక్స్ చెప్పారు.

Also Read :Nitishs Successor: బిహార్‌ పాలిటిక్స్‌లోకి కొత్త వారసుడు.. ఫ్యూచర్ అదేనా ?

వెనెసా సైతం.. 

మరోవైపు వెనెసా సైతం ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు., ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాను టైగర్‌ వుడ్స్‌తో కలిసి దిగిన ఫొటోలను ఆమె షేర్ చేశారు.  తాను టైగర్‌తో(Tiger And Trump) డేటింగ్‌లో ఉన్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌కు మాజీ భార్యే వెనెసా. దీంతో ఆమె సోషల్‌ మీడియా పోస్ట్‌పై అమెరికా మీడియాలో వాడివేడి చర్చ జరుగుతోంది. నెటిజన్లు బాగా రియాక్ట్ అవుతున్నారు.

Also Read :Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కు డాక్టరేట్.. ఏ యూనివర్సిటీ నుంచో తెలుసా?

ట్రంప్‌ జూనియర్‌, వెనెసా బంధం గురించి.. 

ట్రంప్‌ జూనియర్‌ 2005లో వెనెసాను పెళ్లాడు.  13 ఏళ్ల పాటు వారి వివాహ బంధం కొనసాగింది. ఆ తర్వాత ట్రంప్ జూనియర్, వెనెసా విడిపోయారు. 2018లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఐదుగురు సంతానం. 2020లో ఫాక్స్‌ న్యూస్‌ మాజీ హోస్ట్‌ కింబర్లీతో ట్రంప్‌ జూనియర్‌‌కు వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే మరో అమ్మాయితోనూ  డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ డేటింగ్‌లో ఉన్నట్లు తాజాగా వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఆయన నడుస్తున్న ఫొటోలు అంతర్జాతీయ మీడియాలో ప్రచురితం అయ్యాయి. కింబర్లీతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నందు వల్లే మరో అమ్మాయితో ట్రంప్ జూనియర్ కలిసి తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  Last Updated: 24 Mar 2025, 12:38 PM IST