Site icon HashtagU Telugu

Canada : వెయిటర్ జాబ్ కోసం భారతీయ విద్యార్థులు అంత కష్టపడాలా..?

Indian Students Part Time J

Indian Students Part Time J

ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను ఓ స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. తమలాగే వారు ఎండలో కష్టపడొద్దని..ఏసీ గదుల్లో నెలకు లక్షల్లో సంపాదించాలని భావిస్తారు. అందుకోసం వారిని ఇతర దేశాల్లో ఉన్నంత చదువుల కోసం పంపిస్తుంటారు..ఇదే క్రమంలో మరికొంతమంది సమాజంలో తమ స్థాయి ఇది అని గొప్పలు చెప్పుకునేందుకు కూడా తమ పిల్లలను విదేశాలకు పంపిస్తుంటారు. ఆలా విదేశాలకు వెళ్లిన వారు అక్కడ నానా కష్టాలు పడుతుంటారు. ఇంట్లో వారు పంపించే డబ్బులు సరిపోక..అక్కడ పలు పార్ట్ టైం జాబ్స్ (Part Time Jobs) చేస్తూ తమ ఖర్చులు వెళ్లదీసుకుంటారు. అయితే గతంలో అమెరికా , కెనడా (America, Canada) లో భారతీయ విద్యార్థులకు (Indian students) పార్ట్ టైం జాబ్స్ పుష్కలంగా దొరికేవి..హోటల్ లో వెయిటర్ జాబ్స్ , పెట్రోల్ బంక్ లలో జాబ్స్ , ఇలా అనేక జాబ్స్ ఉండేవి..వాటికీ పెద్దగా పోటీ కూడా ఉండకపోయేవి. దీంతో వారి లైఫ్ సాఫీగా నడుస్తుండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమెరికా లేదా కెనడా (Canada ) కావచ్చు ఉద్యోగాలు (Jobs) అంత ఈజీగా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

తాజాగా.. కెనడాలో ఓ రెస్టారెంట్‌లో (Restaurant) వెయిటర్ జాబ్ (Waiter Job) కోసం భారతీయ విద్యార్థులు కిలోమీటర్ల వరకుబారులు తీరిన వీడియోని చూస్తే..అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. కెనడాలో తందూరి ఫ్లేమ్ అనే రెస్టారెంట్ ముందు, జాబ్ ఇంటర్వ్యూ కోసం భారతీయ విద్యార్థులు క్యూలో నిలుచున్న వీడియో వైరల్ అవుతోంది. వేలాది మంది వెయిటర్, సర్వీస్ స్టాఫ్‌ ఉద్యోగాల కోసం వరసలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కెనడాలో చదువుకోవాలని, పనిచేయాలనుకునే వారిని ఒకటికి రెండుసార్లు ఆలోచింపచేస్తోంది.

లైన్‌లో వేచి ఉన్న విద్యార్థుల్లో ఒకరైన అగంవీర్ సింగ్ మాట్లాడుతూ.. ”నేను మధ్యాహ్నం 12గంటలకు ఇక్కడికి వచ్చాను. లైన్ భారీగా ఉంది. ఇంటర్నెట్ ద్వారా అప్లికేషన్ పెట్టా. ఇంటర్వ్యూ చేస్తామని చెప్పారు. కానీ అలాంటిదేం జరగలేదు. ఇక్కడ ఉద్యోగం ఉంటుందని నేను నమ్మను” అని చెప్పాడు. మరొక విద్యార్థి మాట్లాడుతూ.. ”ఎవరికీ సరిగ్గా ఉద్యోగాలు లభించడంలేదు. నా స్నేహితుల్లో చాలా మందికి ఉద్యోగాలు లేవు.” అని తెలిపాడు. ప్రస్తుతం అమెరికా , కెనడా లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని..విదేశాల్లో చదువు కోవాలని ఆలోచించే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.

Read Also : Megastar Injured: మెగాస్టార్ చిరంజీవి చేతికి గాయం.. వీడియో వైర‌ల్‌