ఇది అల్లా, జీసెస్ మధ్య ఫైట్.. పోరాటంలో ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా.. అమెరికా-ఇరాన్ యుద్ధంపై ఆర్జీవీ సంచలన ట్వీట్

Ram Gopal Varma controversy  మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధ భయంతో వణికిపోతుంటే, వర్మ మాత్రం ఈ భయానక అంశాన్ని ఒక ‘దైవిక పోరాటం’గా అభివర్ణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణను ఆయన కేవలం దేశాల మధ్య యుద్ధంగా కాకుండా, “జీసస్ – అల్లా మధ్య జరుగుతున్న యుద్ధం” అంటూ సోషల్ మీడియాలో […]

Published By: HashtagU Telugu Desk
Ram Gopal Varma

Ram Gopal Varma

Ram Gopal Varma controversy  మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధ భయంతో వణికిపోతుంటే, వర్మ మాత్రం ఈ భయానక అంశాన్ని ఒక ‘దైవిక పోరాటం’గా అభివర్ణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణను ఆయన కేవలం దేశాల మధ్య యుద్ధంగా కాకుండా, “జీసస్ – అల్లా మధ్య జరుగుతున్న యుద్ధం” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నాస్తికుడిగా తనను తాను ప్రకటించుకునే వర్మ, ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే తాను ఆ మతంలోకి మారిపోతానంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. క్లిష్టమైన రాజకీయ పరిణామాలను కూడా తన సెటైరికల్ కోణంలో చూడటం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. గతంలోనూ మతపరమైన నమ్మకాలపై ఇలాంటి సెటైర్లు వేసిన ఆయన, ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధ వాతావరణాన్ని కూడా వదలకుండా తన మార్క్ పోస్ట్‌తో నెట్టింట చర్చకు తెరలేపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Ram Gopal Varma Tweet

  Last Updated: 04 Mar 2026, 10:55 AM IST