Site icon HashtagU Telugu

Russia Ukraine War: మూడో ప్రపంచ యుద్దం తప్పదా? పోలాండ్ లో రష్యా క్షిపణులు..ఇద్దరు పౌరులు మృతి..!!

Russian

Russian

ప్రపంచమంతా భయాందోళన చెందే ఓ వాదన గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ పై ప్రయోగించిన రష్యా క్షిపణులు అనుకోకుండా పక్కనే ఉన్న పోలాండ్ దేశంలో పడిపోయినట్లు ఆ వాదనలో కీలకమైన అంశం. ఈ పేలుడుతో ఇద్దరు పోలాండ్ పౌరులు మరణించారు. ఉక్రెయిన్ పొరుగుదేశమైన పోలాండ్ నాటో సభ్య దేశం. మంగళవారం ఉక్రెయిన్ లోని కైవ్, లివ్, ఖార్కివ్, పోల్టావా, ఒడెస్సాతోపాటు పలు నగరాలపై రష్యా మళ్లీ క్షిపణులను ప్రయోగించింది.

పోలిష్ మీడియా కథనం ప్రకారం…ఈ క్షిపణులు ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని ప్రాంతమైన ప్రిజెవోడ్ అనే పోలీష్ గ్రామంలోపడిపోయాయి. ఇద్దరు పౌరులు మరణించారు. ఉక్రెయిన్ పశ్చిమ నగరమైన ఎల్విన్ పై మాస్కో బ్యారేజ్ క్షిపణిని ప్రయోగించిన సమయంలోనే ఈ క్షిపణ దాడి జరిగింది. దీంతో నాటో కూటమి దేశాలు అలర్ట్ అయ్యాయి. పోలాండ్ అత్యవసర సమావేవంాన్ని నిర్వహించడంతో..మూడో ప్రపంచ యుద్దంపై భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

నాటో భూభాగంలో క్షిపణులు పడితే చర్యలు తీసుకోవల్సిందే జెలెన్స్కీ
పోలాండ్ లో జరిగిన పేలుళ్లపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్పందించారు. ఉగ్రవాదం ఉక్రెయిన్ కు మాత్రమే పరిమితం కాదన్నారు. నాటో భూభాగంపై దాడి చాలా తీవ్రమైన విషయం అన్నారు. దీనిపై చర్య తీసుకోవల్సిందేనని డిమాండ్ చేశారు.
నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుతుంది పెంటాన్
పోలాండ్ లో రష్యా క్షిపణుల దాడి అనంతరం పెంటగాన్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ప్యాట్రిక్ రైడల్ మాట్లాడారు. క్షిపణులు పడిపోవడం గురించి సమాచారం అందింది. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నామని తెలిపారు. మా భద్రతా కట్టుబాట్లు, నాటో భూభాగంలో ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటామని చాలా స్పష్టంగా చెబుతున్నామన్నారు.

ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం…ఈ క్షిపణులు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఉక్రెయిన్ సరిహద్దుకు 5కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రిజ్వోడో గ్రామానికి సమీపంలో ధాన్యం తీసుకెళ్తున్న ట్రాక్టర్ పై పడ్డాయి. ఆ ఫోటోలను విడుదల చేసింది.