world tallest residential tower: ప్రపంచంలోనే పొడవైన టవర్‌ నిర్మాణం అక్కడే..!

దుబాయ్‌లో వంద అంతస్తులతో హైపర్‌ టవర్‌ను నిర్మించేందుకు రంగం సిద్ధమైంది.

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 02:50 PM IST

దుబాయ్‌లో వంద అంతస్తులతో హైపర్‌ టవర్‌ను నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన నివాస భవనంగా రికార్డు సాధిస్తుందని డెవలపర్లు చెబుతున్నారు. ‘బుర్జ్‌ బింఘట్టి జాకబ్‌ అండ్‌ కో రెసిడెన్సెస్‌’ పేరుతో నిర్మించనున్న ఈ టవర్‌‌ పైభాగంపై కిరీటాన్ని పోలివుండేలా డైమండ్‌ ఆకారపు శిఖరాలు ఉంటాయి. తాజాగా ఈ భవన నిర్మాణ డిజైన్‌ను విడుదల చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఒకదానికొకటి ఎత్తైన, విలాసవంతమైన నివాస భవనాలు ఉన్నాయి. ఈ క్రమంలో అతి త్వరలో దుబాయ్‌లో మరో కొత్త పొడవైన టవర్‌ నిర్మించబోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనం అవుతుందని డెవలపర్స్ చెబుతున్నారు. ఈ భవనాన్ని ఎమిరాటీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ కంపెనీ బింఘట్టి, వాచ్ మేకర్ జాకబ్ & కో సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ రెండు కంపెనీలు ఈ భవనం డిజైన్‌ను తాజాగా విడుదల చేశాయి. “ప్రపంచంలోని ఎత్తైన నివాస భవనాలలో ఒకదాన్ని నిర్మించడమే మా లక్ష్యం” అని వారు పేర్కొన్నారు. ఈ భవనం 100 అంతస్తులతో ఉండనుంది.

ఓ నివేదిక ప్రకారం.. ఈ అద్భుతమైన టవర్ పైభాగంలో డైమండ్‌ ఆకారపు శిఖరాలు ఉంటాయి. దీనితో పాటు ఈ టవర్‌లోని సౌకర్యాల గురించి మాట్లాడినట్లయితే.. బాడీగార్డ్ సేవలు, డ్రైవర్లు, ప్రైవేట్ చెఫ్‌లు కూడా అందుబాటులో ఉంటారు. ఇన్ఫినిటీ పూల్, లాంజ్ ఏరియాతో ప్రత్యేకమైన ప్రైవేట్ క్లబ్ ని నిర్మించే ప్రణాళికలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.