Site icon HashtagU Telugu

Worlds Dangerous Airport : ప్రపంచంలోనే డేంజరస్ ఎయిర్‌పోర్టు.. విశేషాలివీ..

Worlds Dangerous Airport Bhutan Paro International Airport

Worlds Dangerous Airport : ఆ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండింగ్‌ చేయించడం అనేది పైలట్లకు పెను సవాల్. ఇప్పటివరకు ఆ ఎయిర్‌పోర్టులో 50 మంది పైలట్లు మాత్రమే విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేయించగలిగారు. ఆ ఎయిర్ పోర్టు భూటాన్‌లో ఉంది. దాని పేరు.. పారో ఎయిర్ పోర్టు. ఈ విమానాశ్రయం చుట్టూ 18వేల అడుగుల ఎత్తయిన హిమాలయ పర్వతాలు(Worlds Dangerous Airport) ఉన్నాయి. అందుకే అక్కడ విమానాల ల్యాండింగ్ చేయించడం పెద్ద ఛాలెంజ్.

Also Read :Manish Sisodia : పార్టీ మారకుంటే చంపేస్తామన్నారు.. మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు

పారో ఎయిర్ పోర్టు అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో ఒకటి. దీని రన్‌వే పొడవు 7,431 అడుగులే. పారో విమానాశ్రయం సముద్ర మట్టానికి 7,382 అడుగుల ఎత్తున ఉంటుంది. దీంతో కేవలం చిన్న విమానాలను మాత్రమే ల్యాండింగ్‌ చేయించగలం. చుట్టూ పర్వతాలు ఉండటంతో ఆ విమానాశ్రయం ఏరియాలో విమానాలకు పెద్దగా రాడార్‌ గైడెన్స్‌ లభించదు. ఈ ప్రతికూలత నడుమ విమానాన్ని ల్యాండింగ్ చేయించే విషయంలో పైలట్లు ప్రత్యేక శిక్షణ పొందాల్సి ఉంటుంది. విమానాన్ని ల్యాండింగ్  చేయించే క్రమంలో  ఒక చిన్న తప్పు చేసినా ప్రమాదం ఎదురయ్యే ముప్పు ఉంటుంది. పారో ఎయిర్‌ పోర్టులో ల్యాండింగ్‌కు అర్హత పొందిన పైలట్లు కేటగిరి-సి కిందకు వస్తారు. ఏవియేషన్‌ పరిశ్రమలో ఈ కేటగిరీ పైలట్లను డేర్‌డెవిల్స్‌ అని పిలుస్తుంటారు.

Also Read :Raj Thackeray : పాకిస్తాన్ సినిమాను రిలీజ్ చేస్తే ఖబడ్దార్.. థియేటర్లకు రాజ్‌థాక్రే వార్నింగ్

వాతావరణ మార్పులు, గాలి సాంద్రతలో తేడాల కారణంగా మధ్యాహ్నం వేళ ఈ ఎయిర్ పోర్టులో విమాన ప్రయాణాలను పైలట్లు సాధ్యమైనంత వరకు వాయిదా వేస్తారు. వర్షాకాలంలో ఈ ఎయిర్ పోర్టులో  గోల్ఫ్‌బాల్‌ సైజు వడగళ్లు పడుతుంటాయి. రాడార్‌ సిగ్నల్స్‌ ఈ విమానాశ్రయం ఏరియాలో ఉండవు. అందువల్ల రాత్రివేళల్లో విమానాలను ఇక్కడ ల్యాండింగ్‌కు అనుమతించరు. భూటాన్‌లో 97 శాతం భూభాగం పర్వతాలమయంగా ఉంటుంది.

Also Read :TTD: లడ్డూ వివాదం..ప్రధానికి వైఎస్‌ జగన్‌ లేఖ