Site icon HashtagU Telugu

Top Choice US : విదేశీ విద్యకు భారత విద్యార్థుల ఫస్ట్ ఛాయిస్.. అమెరికా

Top Choice Us

Top Choice Us

Top Choice US : విదేశీ విద్య కోసం భారత విద్యార్థుల టాప్ చాయిస్ ఏదో తెలుసా ? అమెరికా !! వరుసగా మూడో ఏడాది కూడా భారత్ నుంచి రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. తాజాగా ఈరోజు విడుదలైన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ (ODR)‌లో ఈవివరాలు వెల్లడయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగింది. 2022-23 విద్యా సంవత్సరంలో ఆల్ టైమ్ హైలెవల్‌లో భారత్ నుంచి 268,923 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. వీరిలో అత్యధికంగా 1.66 లక్షల మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 69వేల మంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ 32వేల మంది(Top Choice US) ఉన్నారు.

2022 కంటే బెటర్‌గా 2023లో.. 

మునుపటి విద్యా సంవత్సరం (2021-22)లో భారత్ నుంచి అమెరికాకు మొత్తం 1.99 లక్షల మంది స్టూడెంట్స్ వెళ్లారు. వారిలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లక్ష మంది, ఓపీటీ విద్యార్థులు 68వేల మంది, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 27వేల మంది ఉన్నారు.  అమెరికాలో చదువుతున్న దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులలో 25 శాతానికిపైగా భారతీయ విద్యార్థులే ఉండటం విశేషం. 2023 జూన్-ఆగస్టు మధ్యకాలంలో భారతదేశం అంతటా అమెరికా కాన్సులర్ అధికారులు F, M, J కేటగిరీల్లో 95,269 వీసాలను భారతీయులకు జారీ చేశారు. 2022 సంవత్సరంతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ.

We’re now on WhatsApp. Click to Join.

“యునైటెడ్ స్టేట్స్‌లో భారతీయ విద్యార్థుల విజయానికి మద్దతు ఇస్తున్న భారతీయ కుటుంబాలకు ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా విద్యార్థులను సిద్ధం చేసే భారతీయ విద్యా వ్యవస్థ గొప్పతనాన్ని మేం మరువలేం. భారత విద్యావ్యవస్థ బలం వల్లే ఇక్కడి నుంచి అధిక సంఖ్యలో అమెరికాకు విద్యార్థులు వెళ్లగలుగుతున్నారు. భారత్ నుంచి విద్యార్థులతో సమానమైన సంఖ్యలో విద్యార్థినులను కూడా మేం భవిష్యత్తులో చూడాలని అనుకుంటున్నాం. భారత్ నుంచి అమెరికాకు విద్యార్థుల సంఖ్య మరింత పెరగాలని ఆశిస్తున్నాం’’ అని  భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ అన్నారు. 

Also Read: Samantha : బాత్ టబ్‌‌లో ఫొటో షేర్ చేసిన సమంత.. భూటాన్‌లో ఫుల్ ఎంజాయ్..