Russia Vs West : మాస్కోపై ఉగ్రదాడి పశ్చిమ దేశాల పనే.. రష్యా సంచలన ఆరోపణలు

Russia Vs West : రష్యా రాజధాని మాస్కోపై మార్చి 21న జరిగిన భీకర ఉగ్రదాడి వెనుక  ఉక్రెయినే ఉందని పుతిన్ పదేపదే చెబుతున్నారు.

  • Written By:
  • Publish Date - March 27, 2024 / 11:50 AM IST

Russia Vs West : రష్యా రాజధాని మాస్కోపై మార్చి 21న జరిగిన భీకర ఉగ్రదాడి వెనుక  ఉక్రెయినే ఉందని పుతిన్ పదేపదే చెబుతున్నారు. మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌పై దాడిచేసిన ఉగ్రవాదులు ఉక్రెయిన్ సరిహద్దు వైపే పరుగులు తీశారని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. అమెరికా సహా పశ్చిమ దేశాల నిఘా సంస్థలు, ఉక్రెయిన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ విభాగం చేతులు కలిపి మాస్కోలో ఉగ్ర దాడికి ఐసిస్‌ను పురికొల్పాయని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధిపతి అలెగ్జాండర్ బోర్ట్నికోవ్ కూడా ఆరోపించారు. దీంతో ఈ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ – ఖొరాసన్ (ఐసిస్ – కే) ప్రకటించినా రష్యా ఎందుకు పట్టించుకోవడం లేదు ? ఇది ఐసిస్-కే ఘాతుకమే అని అమెరికా, ఫ్రాన్స్ దేశాలు అధికారికంగా నిర్ధారణ చేస్తున్నా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎందుకు నమ్మడం లేదు ? అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.

We’re now on WhatsApp. Click to Join

మాస్కోపై ఉగ్రదాడికి పాల్పడింది తజికిస్తాన్‌కు చెందిన అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదులే అనే విషయాన్ని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధిపతి అలెగ్జాండర్ బోర్ట్నికోవ్ ఇటీవల ధ్రువీకరించారు. దాడి చేసిన ఉగ్రవాదుల మూలాలను, ప్రేరేపించిన సంస్థలను వెలికితీయడంపై తమ ఫోకస్ ఉందని తెలిపారు. మరోవైపు మాస్కోలో జరిగిన ఉగ్రదాడికి ఉక్రెయినే కారణమని పుతిన్ చేస్తున్న ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Russia Vs West) ఖండిస్తున్నారు. ఉక్రెయిన్‌‌పై సైనిక చర్య తీవ్రతను మరింత పెంచేందుకు ఉగ్రదాడి ఘటనను రష్యా సాకుగా వాడుకుంటోందని పేర్కొన్నారు.

Also Read : Kejriwal Vs ED : కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం.. మూడువారాల టైం కోరిన ఈడీ

మాస్కోపై దాడికి తెగబడిన నలుగురు ఉగ్రవాదులూ తజికిస్తాన్ వాస్తవ్యులే. వారిలో ఇద్దరు (ఫరీదుని, రచబలిజోడా) ఈ ఏడాది ప్రారంభంలో టర్కీలో కొన్నిరోజులు గడిపినట్లు రష్యా విచారణలో వెల్లడైంది. ఉగ్రవాది రచబలిజోడా(30) జనవరి 5న, టెర్రరిస్టు ఫరీదుని(25) ఫిబ్రవరి 20న టర్కీకి వచ్చారని తేలింది. వీరిద్దరూ కలిసి మార్చి 2 న టర్కీ నుంచి రష్యాకు వచ్చారనే విషయం బహిర్గతమైంది. ఈ ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను టర్కీ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ గుర్తించినప్పటికీ.. అరెస్టు వారెంట్ లేకపోవడంతో అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఉగ్రవాదులు రష్యాలోకి చేరుకొని మాస్కోకు చేరుకొని మార్చి 21న రాత్రి క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌పై దాడి చేయాలనే వ్యూహ రచన చేసినట్లు రష్యా దర్యాప్తు విభాగాల ప్రాథమిక విచారణలో తేలిందట.

Also Read :Kangana Ranaut: కంగ‌నా ర‌నౌత్ కు పోటీగా మ‌రో బాలీవుడ్ న‌టి..? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే..?