Site icon HashtagU Telugu

World Special Village : ప్రపంచంలోనే వింత గ్రామం, ఇక్కడ ప్రజలు మాట్లాడేటప్పుడు, నడుస్తున్నప్పుడు నిద్రపోతారు.!!!

Kalachi

Kalachi

ప్రశాంతమైన నిద్ర తర్వాత, మనమందరం(World Special Village) రిఫ్రెష్, ఫిట్‌గా ఉంటాము. అయితే కొంతమందికి ఈ నిద్ర ఫిట్‌గా, రిఫ్రెష్‌గా ఉండదు. అవును మీరు చదవింది నిజమే. కొంతమందికి నిద్ర అనేది అనారోగ్యంగా గురిచేస్తుంది. ఇది ఎలా సాధ్యమని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతున్నారా?. కానీ, ప్రపంచంలోని ఓ మూలన ఉన్న గ్రామంలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ మనుషులు ఒక్కసారి నిద్రపోతే ఎక్కువసేపు లేవరు. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ నిద్రపోతుంటారు. వీరిని చూసి నిపుణులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ వింతైన గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకుందాం.

ఈ గ్రామం పేరు కలాచి. ఇది ఉత్తర కజకిస్తాన్‌లో ఉంది. ఇక్కడి ప్రజలు నిద్రలేమి అనే మర్మమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇక్కడ ప్రజలు అకస్మాత్తుగా నిద్రపోతారని, కొన్నిసార్లు చాలా నెలలు మేల్కొనరని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధి మొదటిసారిగా 2010 సంవత్సరంలో కనుగొనబడింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో, గ్రామంలో చాలా మంది పిల్లలు అకస్మాత్తుగా నిద్రపోయారు, ఆ తర్వాత చాలా కాలం తర్వాత పిల్లలు మేల్కొన్నారు. అప్పటి నుంచి ఇక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. దీని తరువాత, ఇటువంటి కేసులు కూడా తెరపైకి వచ్చాయి, ప్రజలు రోజువారీ పని చేస్తున్నప్పుడు లేదా మాట్లాడేటప్పుడు, నడుస్తున్నప్పుడు చాలాసార్లు నిద్రపోతారు. ఇక్కడి ప్రజలకు ఈ వ్యాధి గురించి ఏమాత్రం అవగాహన లేదని, నిద్రలేచినప్పుడల్లా అన్నీ మర్చిపోతున్నారన్నారు. అందుకే దాన్ని పట్టించుకోవడం లేదు. అదే సమయంలో, నివేదిక ప్రకారం, ఇక్కడ సుమారు 14 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని తేలింది.

ఈ ఘటనను చూసి నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. హఠాత్తుగా ఇలా నిద్రపోతున్న వ్యక్తులపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే, మీడియా కథనాల ప్రకారం, ఇలా ఎందుకు జరుగుతుందనేది ఇంకా ఖచ్చితమైన నిర్ధారణకు రాలేదు.