Swine Fever Case : వణికిస్తోన్న స్వైన్ ఫీవర్…7వేలకు పైగా పందులు బలి..!!

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ దక్షిణ కొరియాను వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దక్షిణకొరియా 7,000లకు పైగా పందులను వధించింది

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 04:23 PM IST

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ దక్షిణ కొరియాను వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దక్షిణకొరియా 7,000లకు పైగా పందులను వధించింది. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. వ్యవసాయం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సియోల్‌కు ఈశాన్యంగా 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న చున్‌చెయోన్‌లోని ఒక పంది నుండి ఈ వైరస్ వ్యాపించినట్లు తెలిపారు. మొత్తం 7,000 పందులు చంపినట్లు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు గాంగ్వాన్ ప్రావిన్స్‌లోని పందుల పెంపకం, సంబంధిత సౌకర్యాలపై ప్రభుత్వం 24 గంటల నిలిపివేత ఉత్తర్వులు జారీ చేసింది. సమీపంలోని 43 పొలాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని యోన్‌హాప్ వార్తా సంస్థ తెలిపింది.

కాగా ప్రావిన్స్‌లోని దాదాపు 200 పందుల ఫారాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ప్రణాళికలు కూడా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు స్థానిక ప్రభుత్వాలతో సహకరించాలని ప్రధాని హన్ దక్ సూ అధికారులను ఆదేశించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మానవులను ప్రభావితం చేయదు కానీ పందులకు ప్రాణాంతకం. ఈ వ్యాధికి ప్రస్తుతం టీకా లేదా చికిత్స లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో పంది మాంసం సరఫరాను ప్రభావితం చేసే అవకాశం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మధ్యకాలంలో, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా పందుల పరిశ్రమ భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ వ్యాధికి ఇంకా ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.