Nepal Air Crash: ప్రయాణాన్ని చాలా వేగవంతం మరియు సులభతరం చేస్తూ విమానాలు ప్రయణికులకు కొత్త సదుపాయాలను కల్పిస్తున్నాయి. చాలా సుదూర ప్రాంతాలను సైతం అతి తక్కువ సమయంలో చేరుకునేలా విమానాలు చేశాయి. అయితే ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తున్న ఈ విమానాలు.. అప్పుడప్పుడు భారీ ప్రమాదాలకు గురవుతుంటాయి.
తాజాగా నేపాల్ లో ఇలాంటి ఘోర ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది. విమానాన్ని రన్ వే మీద ల్యాండ్ చేసే సమయంలో అనుకోకుండా విమానం ఒక్కసారిగా అదుపుతప్పి విమానం కూలిపోయింది. దీంతో విమానంలోని చాలామంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదంలో భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
నేపాల్ లోని పోఖారా విమానాశ్రయంలో రన్ వే మీద విమానాన్ని ల్యాండ్ చేస్తుండగా.. విమానం ఒక్కసారిగా విమానం కూలిపోయింది. ఈ విమాన ప్రమాదం జరుగుతున్న సమయంలో నలుగురు విమాన సిబ్బందితో సహా 72 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం కూలిన వెంటనే విమానాశ్రయాన్ని అధికారులు వెంటనే మూసివేశారు.
వెంటనే నేపాల్ ఆర్మీ విమానాశ్రయంలో విమాన ప్రమాద బాధితులను ఆదుకునేందుకు సహాయ చర్యలు చేపట్టింది. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 67 మంది ప్రయాణికుల శవాలను బయటకు తీశారు. అయితే ఇందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదానికి పొగమంచు కారణం అని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు.