Site icon HashtagU Telugu

Volcano: ఆ దేశంలో బద్ధలైన అగ్ని పర్వతం… కమ్ముకున్న ధూళి!

Maxresdefault

Maxresdefault

Volcano: ఇండోనేషియాలోని మెరాపి అగ్నిపర్వతం బద్దలైంది. దీని ప్రభావంతో సుమారు ఏడు కిలోమీటర్ల మేర ధూళి మేఘాలు కమ్ముకున్నాయని ఆ దేశానికి చెందిన వివత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇండోనేషియాలోని యొగ్యకర్తా ప్రాంతంలో ఉన్న మెరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఘటన జరిగింది. 1.5 కిలోమీటర్ల మేర లావా ప్రవాహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలంతా బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. 2,963 మీటర్ల ఎత్తు కలిగిన మెరాపి పర్వతం ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్నిపర్వాతాల్లో ఒకటిగా పేరొందింది.

ఇండోనేషియాలో అత్యధిక సంఖ్యలో అగ్నిపర్వతాలు కనిపిస్తాయి. మెరాపి గతంలో 2010లో భారీగా విస్పోటనం చెందింది. అప్పట్లో ఈ ప్రమాదంలో 350 మందికి పైగా జనం మరణించారు. ఇండోనేషియా సముద్ర అంతర్భాగం లోనూ అనేక అగ్నిపర్వాతాలు ఉన్నాయి. వీటి విస్పోటనాల కారణంగా ఆ ప్రాంతంలో అధికంగా భూకంపాలు వస్తుంటాయి. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల యాక్టివిటీ కూడా అధికంగా ఉంటుంది. 2004లో ఇండోనేషియా పరిధిలో వచ్చిన సునామీ, భూకంపానికి ఈ టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీయే కారణమని గుర్తించారు. 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి సునామీ అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ విపత్తులో పలు దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

Exit mobile version